• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘2.0’ కథ అలా ఉండదట

‘2.0’ కథ అలా ఉండదట

By - Tupaki Desk
Update: 2017-10-11 17:30 GMT
శంకర్-రజినీకాంత్‌ల ‘2.0’ను ‘రోబో’కు సీక్వెల్ అనే అనుకుంటున్నాం మొదట్నుంచి. రజినీకాంత్ రోబో అవతారంలో కనిపిస్తుంటే అలా అనుకోకుండా ఎలా ఉంటాం మరి? కానీ ఈ సినిమాలో రజినీకాంత్ రోబోగా కనిపించడం మినహాయిస్తే ‘రోబో’కు దీనికి అసలు పోలికే ఉండదంటున్నాడు శంకర్. ‘రోబో’ కథకు ఇది కొనసాగింపు కాదని శంకర్ చెప్పాడు. ఓ కొత్త కథతో తాను ఈ సినిమా తీసినట్లు వెల్లడించాడు. మరి ఈ సినిమాలో ‘చిట్టి’ పాత్ర కూడా ఉండదన్నమాటే.

ఐతే రజినీ ఇందులో కూడా శాస్త్రవేత్తగా - రోబోగా కనిపిస్తాడన్నది మాత్రం వాస్తవం. ‘రోబో’లో విలన్ కూడా రజినీయే కాగా.. ‘2.0’లో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నాడు. మరి ఈ పాత్రలతో శంకర్ కథను ఎలా నడిపించాడన్నది ఆసక్తికరం. ఇటీవలే ‘2.0’ త్రీడీ మేకింగ్ కు సంబంధించి చిత్ర బృందం రిలీజ్ చేసిన వీడియో సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.

ఈ నెలాఖర్లో దుబాయ్ వేదికగా భారీ ఖర్చుతో ఆడియో వేడుక చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా ‘2.0’ టీజర్ లాంచ్ ఉంటుంది. డిసెంబర్లో చెన్నైలో ట్రైలర్ విడుదల చేస్తారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ గత ఏడాదే ముంబయిలో చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 25న ‘2.0’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. చాన్నాళ్ల కిందటే షూటింగ్ ముగించిన శంకర్.. కొన్ని నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నాడు.
Tags:    
  • Shankar 
  • Robo 2.0 Movie 
  • Telugu NEWs 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS