కింగ్ ఖాన్ లో డైలమా ఇంకా క్లియర్ కాలేదా?
కింగ్ ఖాన్ షారూక్ నటించే సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ప‌్రపంచవ్యాప్తంగా ఉన్న బాద్ షా ఫ్యాన్స్ లో నెలకొన్న ఉత్కంఠ ఇది. జీరో సినిమా రిలీజై అప్పుడే రెండేళ్లవుతున్నా.. ఇంకా తాను నటించే సినిమా ఏదీ ప్రకటించలేదు.
ఇటీవల తమిళ దర్శకుడు అట్లీతో కలిసి పని చేస్తారని.. అలాగే యష్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ధూమ్ 4లో నటిస్తారని రకరకాలుగా ప్రచారమైనా దేనినీ షారూక్ కన్ఫామ్ చేయలేదు. ఇకపోతే కింగ్ ఖాన్ నిర్మాణ సంస్థ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో నిరంతరం చిత్రాలను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రెడ్ చిల్లీస్ ప్రొడక్షన్ హౌస్ నుండి మరో చిత్రం ప్రకటించారు. లవ్ హాస్టల్ పేరుతో ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రానుంది. విక్రాంత్ మాస్సే- సన్యా మల్హోత్రా- బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్ రామన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. 2021 మొదటి మిడిల్ లో చిత్రీకరణకు వెళ్లనుంది. SRK భార్య గౌరీ ఖాన్ మనీష్ ముంద్రా .. గౌరవ్ వర్మ సహకారంతో ఈ మూవీని నిర్మించనున్నారు. సొంత బ్యానర్లో నిర్మించేవి కాక షారూక్ నటించే సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆ ప్రకటన ఎప్పటికి వస్తుందో చూడాలి.