• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కింగ్ ఖాన్ ఎంత బాగా...

కింగ్ ఖాన్ ఎంత బాగా ఎస్కేప్ అయ్యాడో

By - Tupaki Desk
Update: 2016-07-01 06:46 GMT
అనుభవానికి మించిన పాఠాలు మరేమీ ఉండవని చెబుతుంటారు. ఆ విషయం నిజమన్న విషయాన్ని తన మాటతో చెప్పేశారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్. వివాదాస్పద అంశాలకు వీలైనంత దూరంగా ఉండాలన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్లుగా ఉంది తాజాగా షారూక్ మాటలు చూస్తుంటే. ఫైట్ షూట్ తర్వాత తన పరిస్థితి రేప్ కు గురైన మహిళ మాదిరి ఉందంటూ కండల వీరుడు సల్మాన్ తన నోటి తుత్తరను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

అతడి మాటలు ఎంత వివాదాస్పదం అయ్యాయి. జాతీయ మహిళ సంఘం దగ్గర నుంచి సగటు మనిషి వరకూ సల్మాన్ ను చెడామడా తిట్టేశారు. ఎవరి వరకో ఎందుకు.. సల్మాన్ తండ్రి సైతం బాహాటంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పుకున్న దుస్థితి. ఇంత జరిగినా.. సల్మాన్ లోని మొండి మనిషి మాత్రం నోరు విప్పింది లేదు.. సారీ చెప్పింది లేదు. అందరూ అన్నేసి మాటలు అంటున్నా.. మౌనంగా ఉంటూ.. తాను తప్పు మాట్లాడలేదన్నట్లుగా తన లాయర్ చేత చెప్పించేశారు.

ఇదిలా ఉంటే.. ఇదే ఇష్యూ మీద కింగ్ ఖాన్ షారూక్ ను మీడియా స్పందించాలని కోరింది. ఈ మధ్య కాలంలో తన మాటలు వివాదాస్పదం అవుతున్న దృష్ట్యా ఆచితూచి మాట్లాడిన ఆయన తెలివిగా సమాధానం చెప్పి.. తప్పించుకోవటం విశేషం. ఈ మధ్య కాలంలో తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదం అవుతున్నాయని.. తన మాటలే కాంట్రావర్సీ అవుతున్న వేళ.. వేరే వారు మాట్లాడిన కాంట్రావర్సీ స్టేట్ మెంట్ల మీద తానేమి స్పందించగలనంటూ తెలివిగా నాలుగు మాటలు చెప్పేసి తన దారిన తాను వెళ్లిపోవటం గమనార్హం. మొత్తానికి మాటలతో బుక్ కాకుండా.. తెలివిగా తప్పించుకునే మార్గాన్ని షారుక్ తెలుసుకున్నట్లు కనిపిస్తున్నట్లు లేదు..?
Tags:    
  • Shah Rukh Khan 
  • Salman Khan 
  • Telugu NEWs 

Similar News

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS