అందుకే పుట్టానంటున్న కింగ్ ఖాన్

Update: 2018-01-11 23:30 GMT
బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ ప్రస్తుతం సినిమాల పరంగా తన రేంజ్ చూపించలేకపోతున్న మాట వాస్తవమే. అలాగని కింగ్ ఖాన్ క్రేజ్ కు వచ్చిన లేటేమీ లేదు. ఒక్కటి కరెక్ట్ మూవీ పడిందంటే మళ్లీ బాలీవుడ్ లో తన రేంజ్ చూపించడం ఖాయం అంటారు అభిమానులు. మరోవైపు బ్రాండ్ అండార్స్ మెంట్స్ లో షారూక్ చూపించే జోరు మరెవరి వల్లా కాదని చెప్పాలి.

ఇవన్నీ కాకుండా సోషల్ సర్వీస్ లో కూడా షారూక్ కి చాలానే పేరుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అందిస్తున్న క్రిస్టల్ అవార్డ్స్ లో.. ఈ బాలీవుడ్ బాద్షాకి ఓ పురస్కారం ప్రకటించారు. జనవరి 22న జరగనున్న వార్షిక సదస్సులో ఈ అవార్డు అందించనుండగా.. బాలీవుడ్ దర్శకుడు కేట్ బ్లాంచెట్.. మ్యూజిక్ ఆర్టిస్ట్ సర్ ఎల్టన్ జాన్ తో పాటు.. వీరితో పాటు షారూక్ కి కూడా అవార్డ్ అందించనున్నారు. భారత దేశంలో పిల్లలు.. మహిళల హక్కుల కోసం పోరాడుతున్నందుకు గాను.. ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు

"ఈ గౌరవానికి కృతజ్ఞతలు. ఈ హీరోలు.. మహిళల కోసం నేను ఎంతో కొంత చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తాను. వారు మరింత గౌరవంగా బ్రతికేందుకు ఇతోధిక సాయం చేస్తాను. మహిళలు మరింత ఉన్నతంగా జీవించేందుకు సహకరిస్తాను" అని చెప్పుకొచ్చాడు షారూక్ ఖాన్. వారికి సాయం చేసేందుకు తాను పుట్టానని.. ఈ స్థాయికి చేరానని చెబుతున్నాడు కింగ్ ఖాన్.
Tags:    

Similar News