ఉస్తాద్ ప్రీరిలీజ్: రాశీ ఖన్నా-శ్రీ‌లీల‌పైనే అంద‌రి క‌ళ్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.;

Update: 2026-03-16 02:57 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రీ-రిలీజ్ వేడుక అభిమానుల కోలాహలంతో దద్దరిల్లిపోతోంది. ఈ వేదికపై పవర్ స్టార్ క్రేజ్ ఒకవైపు .. చిత్ర కథానాయికలు రాశీ ఖన్నా, శ్రీలీల తమ అందచందాలతో అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో అందరి కళ్లను తమవైపే తిప్పుకున్నారు. వీరిద్దరి గ్లామర్ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ముఖ్యంగా రాశీ ఖన్నా ఈ వేడుకలో ధరించిన పింక్ కలర్ డిజైనర్ డ్రెస్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పింక్ లుక్‌లో రాశీ నిజంగానే `సంథింగ్ స్పెషల్`గా కనిపించారు. రాశీ శరీర ఛాయకు ఆ రంగు ఎంతో అందాన్ని ఇచ్చింది. యూనిక్ ఎంబ్రాయిడరీ , మోడరన్ కట్ ఉన్న ఆ డిజైనర్ వేర్‌లో రాశీఖ‌న్నా దేవకన్యలా మెరిసిపోయారు. రాశీ తన ఆహార్యంతో క్లాసిక్ స్టైలిష్ లుక్‌ను మేళవించి అభిమానుల గుండెల్లో గుబులు రేపారు.

మరోవైపు టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తన స్పెషల్ డిజైనర్ లుక్‌తో వేదికపై దుమారం రేపారు. తనదైన చురుకుదనం, మెరుపు తీగలాంటి రూపానికి తగ్గట్టుగా శ్రీ‌లీల ఎంచుకున్న దుస్తులు ఎంతో వైవిధ్యంగా ఆక‌ర్షించాయి. ఈవెంట్‌లో ప్రతి అడుగులోనూ శ్రీ‌లీల‌లోని ప్రత్యేకమైన రాజసం కనిపించింది. శ్రీలీల గ్లామర్ అంద‌మైన‌ చిరునవ్వుకు తోడుగా ఆ డిజైనర్ లుక్ తోడవ్వడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. శ్రీలీల తన లుక్‌తో యువతను కట్టిపడేశారనడంలో సందేహం లేదు.

ఈ ఇద్దరు భామలు ఒకే వేదికపై మెరవడంతో శిల్పకళా వేదిక గ్లామర్ లోకానికే చిరునామాలా మారింది. రాశీ ఖన్నా తన క్లాస్ లుక్‌తో ఆకట్టుకుంటే.. శ్రీలీల ఎనర్జిటిక్ అప్పియరెన్స్‌తో అలరించారు. వీరిద్దరి డ్రెస్సింగ్ స్టైల్ .. కెమెరా ముందు వారు ఇచ్చిన పోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో వీరి పాత్రలు కూడా ఇంతే కలర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని ఈ వేడుకను చూస్తుంటే అర్థమవుతోంది.

`ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో రాశీ ఖన్నా , శ్రీలీల పాత్రలు సినిమాకు రెండు విభిన్నమైన పార్శ్వాలను జోడించబోతున్నాయి. శ్రీలీల ఈ సినిమాలో పక్కా మాస్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ బ్యూటీని ఒక చురుకైన అల్ల‌రి చేసే అమ్మాయిగా చూపించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో శ్రీ‌లీల‌ డ్యాన్స్ మూమెంట్స్, కామెడీ టైమింగ్ యువతను ఆకట్టుకోనున్నాయి. శ్రీ‌లీల‌ పాత్ర సినిమాలోని వినోదానికి .. గ్లామర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

మరోవైపు అందాల రాశీ ఖన్నా పాత్ర సినిమాలో కాస్త హుందాగా, క్లాస్‌గా కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతోంది. సమాచారం ప్రకారం రాశీ పాత్ర భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) ప్రయాణంలో కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. రాశీ తన సహజమైన నటనతో ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్‌ను తీసుకురానుంది.రాశీ ఆహార్యం డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేకమైన గ్రేస్ కనిపిస్తుందని సినిమా ద్వితీయార్థంలో రాశీ పాత్ర ఇచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని ఫ్యాన్స్ లో చ‌ర్చ సాగుతోంది. మార్చి 19న విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఎలాంటి రికార్డులు తిర‌గ‌రాస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News