• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరో కొడుకు...

ఆ హీరో కొడుకు అదరగొట్టేశాడు.. ఏకంగా 7 మెడళ్లు

By - Tupaki Desk
Update: 2021-10-26 04:19 GMT
రోటీన్ కు భిన్నమైన సినిమాలు.. డబ్బింగ్ మూవీస్ ద్వారా పరిచయమైన నటుడు మాధవన్. తెలుగులో నేరుగా చేసిన సినిమాలు లేవనే చెప్పాలి. భాష ఏదైనా.. పాత్ర మరేదైనా.. అందులో ఇట్టే ఇమిడిపోయే ఒకప్పటి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న మాధవన్ గురించి ఇప్పుడీ వార్త రాయటం లేదు. ఇప్పుడు అతడి కొడుకు టర్న్ వచ్చింది. తాజాగా ముగిసిన జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో మాధవన్ కుమారుడు వేదాంత్ ఏకంగా ఏడు పతకాల్ని కొల్లగొట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మరాింది.
బెంగళూరులోని బసవనగుడి అక్వాటిక్ సెంటర్ లో జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ అక్వాటిక్ చాంపియన్ షిప్ 2021 పోటీల్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పదహారేళ్ల వేదాంత్ ఏకంగా ఏడు మెడళ్లను సొంతం చేసుకున్నాడు. 800 మీటర్ల ప్రీస్టైల్.. 1500 మీటర్ల ప్రీస్టైల్.. 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పతకాలు.. 100, 200, 400 మీటర్ల ఫ్రీస్టైల్ పోటీల్లో కాంస్య పతకాలు ఉన్నాయి.

ఈ టోర్నీలో ఏకంగా ఏడు పతకాల్ని సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ ట్వీట్ చేస్తూ.. ‘‘గుడ్ జాబ్ వేదాంత్. మీ ప్రదర్శన పట్ల గర్విస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన పలువురు మాధవన్ ను ప్రశంసిస్తున్నారు.

మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాధవన్ కుమారుడు గత మార్చిలో లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లోనూ కాంస్యంతో మెరిసాడు. ఇలా జాతీయ పోటీల్లో అదరగొట్టిన వేదాంత్ పతకాల సాధనపై ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది.
వేదాంత్ ను పోలుస్తూ.. బాలీవుడ్ బాద్షా కుమారుడు ఆర్యన్ ఖాన్ ను తీవ్రంగా తప్పు పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 16 ఏళ్ల వేదాంత్ దేశం కోసం పతకాలు సాధిస్తుంటే.. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులోఅరెస్టుఅయ్యాడు. మాధవన్ కొడుకు సాధించిన పతకాల్ని ప్రశంసించటం బాగానే ఉన్నా.. ఆ పేరుతో షారుక్ కుమారుడ్ని పోలుస్తూ తిట్టిపోయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.




Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS