• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శర్వాతో సెన్సేషనల్...

శర్వాతో సెన్సేషనల్ డైరెక్టర్ సినిమా

By - Tupaki Desk
Update: 2017-09-20 06:26 GMT
అర్జున్ రెడ్డి మూవీతో దర్శకుడు సందీప్ వంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకూ టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియన్ స్క్రీన్ చూడని ఓ బోల్డ్ క్యారెక్టర్ ను సృష్టించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాంగర్ మేనేజ్మెంట్ లో జీరో పాత్రను సృష్టించడమే కాదు.. దాన్ని డీల్ చేసిన విధానం కూడా జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు సందీప్ వంగా మరుసటి ప్రాజెక్ట్ పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సెన్సేషనల్ డైరెక్టర్.. తన కొత్త సినిమా ఎవరితో చేస్తాడు.. ఈసారి ఎలాంటి పాత్రను హీరో కోసం సృష్టించబోతున్నాడనే ఆసక్తి కనిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. ఈ విషయంలో సందీప్ వంగా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడని తెలుస్తోంది. టాప్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ తో ఈ దర్శకుడు తన కొత్త సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈమేరకు ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ప్లాట్ పై హీరో డైరెక్టర్ ఇద్దరికీ సంతృప్తి లభించడంతో.. ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడంలో నిమగ్నమయ్యాడట దర్శకుడు సందీప్ వంగా.

అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ కు చాలానే అవకాశాలు వచ్చినా.. తన స్టైల్ లో మూవీ మేకింగ్ కు సై అనే వారికే మొగ్గు చూపాలన్నది ఈ దర్శకుడి ఆలోచన. అందుకు తగినట్లుగానే టీం సెట్ అయినట్లు చెబుతున్నారు. ఆది హీరోగా చుట్టాలబ్బాయి మూవీ నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి.. సందీప్ వంగా-శర్వానంద్ ల చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. శర్వా లేటెస్ట్ మహానుభావుడు రిలీజ్ తర్వాత.. కొత్త సినిమాపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
Tags:    
  • Sensational Director 
  • Sandeep Vanga 
  • Arjun Reddy Director 
  • Sharwanand 
  • Telugu News 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS