సీనియ‌ర్ మేక‌ప్ మేన్ గంగాధ‌ర్ మృతి

Update: 2021-05-18 10:34 GMT
కోవిడ్ సెకండ్ వేవ్ విల‌యం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు సినీప్ర‌ముఖులు కోవిడ్ భారిన ప‌డి మృతి చెందారు. తాజాగా సీనియ‌ర్ మేక‌ప్ మేన్ గంగాధ‌ర్ కోవిడ్ కి చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆయ‌న తెలుగు చిత్ర‌సీమ‌లో అంద‌రు ప్ర‌ముఖ హీరోలతోనూ పని చేశారు. అలాగే బ‌హుభాషా చిత్రాల‌కు గ‌త 25 ఏళ్లుగా ఆయ‌న మేక‌ప్ మేన్ గా సేవ‌లందిస్తున్నారు.హీరో శివాజీ.. నిర్మాత బెక్కం వేణుగోపాల్ స‌హా ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. మేక‌ప్ మేన్ గంగాధ‌ర్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు.
Tags:    

Similar News