ఫేమస్ 'కపిల్ శర్మ షో'.. నెట్ ఫ్లిక్స్ అలా చేస్తుందా?
దీంతో ఆ వీడియోపై అనేక మంది నెటిజన్లు, కపిల్ శర్మ షో లవర్స్ రెస్పాండ్ అవుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటున్నారు.;
టెలివిజన్ వరల్డ్ లో కపిల్ శర్మ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదేమో. ఇండియాలోనే కాదు.. ఫారిన్ లో కూడా కపిల్ శర్మ షోకు ఉన్న క్రేజ్ వేరు. ప్రతి వీకెండ్ ఈవెనింగ్ ఆడియన్స్.. షో కోసం వెయిట్ చేసే రేంజ్ కు చేరుకుంది. కామెడీ, బోల్డ్ పంచ్ డైలాగ్స్, సడెన్ సర్ప్రైజ్ ఎంట్రీలు, స్టార్ సెలబ్రిటీల ప్రమోషన్లు హైలెట్ అవుతుంటాయి. దీంతో షో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా మారింది.
ఇది వరకు టీవీలో ఆ షో రాగా.. ప్రస్తుత సీజన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ కు చెందిన బిహైండ్ ది సీన్ వీడియోను కమెడియన్ కపిల్ శర్మ షేర్ చేయగా.. తెగ చక్కర్లు కొడుతోంది. అందులో హీరో కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ అనన్య పాండే గెస్టులు గా వచ్చారు.
ఆ సమయంలో కపిల్ వారిద్దరితో మాట్లాడుతూ కార్తీక్ సిక్స్ ప్యాక్ పై కామెడీ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా సీరియస్ మోడ్ లోకి వెళ్లిన కపిల్.. ఆడియన్స్ పై కాస్త ఫైర్ అయ్యారు. తానేమైనా డ్యాన్స్ చేయడానికి వచ్చానా.. ఎందుకలా మీలో మీరు మాట్లాడుకుంటున్నారంటూ క్వశ్చన్ చేశారు. టీమ్ బిజీగా ఉందని, అటెన్షన్ గా ఉండాలని అన్నారు. అంతే కాదు.. నెట్ ఫ్లిక్స్ నుంచి తనకు మెసేజ్‌లు వస్తున్నాయని కూడా చెప్పారు.
దీంతో ఆ వీడియోపై అనేక మంది నెటిజన్లు, కపిల్ శర్మ షో లవర్స్ రెస్పాండ్ అవుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటున్నారు. మెసేజ్ లు వస్తున్నాయని కపిల్ చెప్పడంతో.. నెట్ ఫ్లిక్స్ వ్యూస్, ట్రెండింగ్ నంబర్ల కోసం తీవ్ర ఒత్తిడి తెస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ మార్కెట్ లో పోటీ ఉన్న నేపథ్యంలో పాపులర్ ఫేస్ ల పై ఆధారపడక తప్పడం లేదని వారు అంటున్నారు.
మరోవైపు, కొంతమంది నెటిజన్లు ఓటీటీ పొజిషన్ ను సమర్థిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు స్ట్రేంజర్ థింగ్స్ కొత్త సీజన్ సహా పలు పాపులర్ సిరీస్ లు చూసేశారని, ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్లను అట్రాక్ట్ చేయాలంటే ఫుల్ గా సందడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఒత్తిడి తెస్తున్నారేమోనని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా, కపిల్ శర్మ షోకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పాలి. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ల ఎంట్రీతోపాటు షో ఫార్మాట్ లో వచ్చిన ఛేంజ్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ గెస్ట్ లతో చేసే కన్వర్జేషన్ లో ఇంకాస్త ఫ్రెష్ నెస్ కావాలని మరికొందరు కోరుకుంటున్నారు. అప్పుడు ఇంకా షో హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.