పెళ్లి సంగతి సరే..పెళ్లి కొడుకు అతడేనా?
వెండి తెర లవ్ స్టోరీ లో నటించి నిజంగానే ప్రేమలో పడి పోయిన జంట అది. అతడితో బ్రేకప్ అనంతరం కొంత కాలానికి రోహన్ శ్రేష్ట అనే ఫోటో గ్రాఫర్ తోనూ చెట్టా పట్టాలేసుకుని తిరిగిందనే ప్రచారం ఉంది.;
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్ వృత్తిగత జీవితం దేదీప్యమానంగా సాగిపోతుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో ఓ బ్రాండ్ గా దూసుకుపోతుంది. దీపికా పదుకొణే, కరీనాకపూర్ లాంటి భామలున్నా? తనకెంత మాత్రం పోటీ కాదని సక్సెస్ లతోనే రుజువు చేస్తోంది. ప్రస్తుతం సెలక్టివ్ గా కథలు ఎంచుకుంటూ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తోంది. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే శ్రద్దా కపూర్ లైఫ్ లో బోయ్ ప్రెండ్స్ కి ఎంత మాత్రం కొదవలేదు. అమ్మడు కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి ఎఫైర్ల విషయంలో జోరుగానే కనిపిస్తోంది. తొలుత ఆదిత్యారాయ్ కపూర్ తో డేటింగ్..ఆ వ్యవహాహారం పెళ్లి వరకూ దారి తీయడం..చివరి నిమిషంలో బ్రేకప్ తెలిసింది.
వెండి తెర లవ్ స్టోరీ లో నటించి నిజంగానే ప్రేమలో పడి పోయిన జంట అది. అతడితో బ్రేకప్ అనంతరం కొంత కాలానికి రోహన్ శ్రేష్ట అనే ఫోటో గ్రాఫర్ తోనూ చెట్టా పట్టాలేసుకుని తిరిగిందనే ప్రచారం ఉంది. వారిద్దరి మధ్య రిలేషన్ దాదాపు నాలుగేళ్లు సాగింది. పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ ఆ బంధానికి ప్రేమతో పుల్ స్టాప్ పెట్టేసారు. తాజాగా రైటర్ కం అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతోనే ప్రేమలో పడిందనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎక్కడ చూసినా బాలీవుడ్ వేడుకలకు జంటగా హాజరవ్వడం చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో పెళ్లి చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఓ ప్రమోషన్ కార్యక్రమంలో? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే మాత్రం స్కిప్ కొట్టకుండా నేను కూడా పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. కానీ పెళ్లి కొడుకు ఎవరు? అన్నద మాత్రం అధికారికంగా రివీల్ చేయలేదు. ఇంత వరకూ రాహుల్ మోదీ పేరునే ఎక్కడా అమ్మడు ప్రస్తావించలేదు. అలాగని మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించలేదు. మరి కపూర్ బ్యూటీ ఆ విషయం ఎప్పుడు చెబుతుందో.
ప్రస్తుతం శ్రద్దా కపూర్ `ఈత` అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఈ సినిమా కూడా గత ఏడాది కమిట్ అయింది. కొత్త ఏడాదిలోకి ఎంటర్ అయినా ఇంకా కొత్త ప్రాజెక్ట్ ల వివరాలేవి రివీల్ చేయలేదు. `స్త్రీ3` లోనూ అమ్మడు నటిస్తోంది. ఇప్పటికే అధికారికంగానూ ప్రకటించారు. అలాగే `స్త్రీ`కి సంబంధించి యానిమేషన్ వెర్షన్ కూడా రూపొందిస్తున్నారు. అందులో శ్రద్దా కపూర్ మెయిన్ లీడ్ లో కనిపించనుంది. పాత్రల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు.