తెలివైన నిర్ణయం.. బయటపడ్డ రామ్!
జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన ఈయన పలు విషయాలను చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.;
సాధారణంగా దర్శక రచయితలు ఒక కథను రాసుకునేటప్పుడు అందులో ఫలానా హీరో హీరోయిన్లను ఊహించుకుంటూ ఆ పాత్రలు రాస్తారు. ఆ తర్వాత ఆయా హీరోల వద్దకు ఆ స్క్రిప్ట్ వెళ్తే నచ్చితే ఓకే చేస్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఓకే చేసిన సినిమా డిజాస్టర్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి కొంతమంది ఆ పాత్రల నుండీ తప్పించుకున్నాక .. ఆ సినిమా హిట్ అయింది అంటే అయ్యో ఈ సినిమాని వదులుకున్నామే అని బాధపడితే.. ఇంకొంత మంది ఆ సినిమా డిజాస్టర్ అయితే మంచి పని అయింది అని ఊపిరి పీల్చుకుంటారు. ఇకపోతే ఇక్కడ హీరో రామ్ మాత్రం తెలివైన నిర్ణయం తీసుకొని విమర్శల నుంచి బయటపడ్డారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ డైరెక్టర్ కిషోర్ తిరుమల తాజాగా రవితేజ తో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన ఈయన పలు విషయాలను చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే రఘువరన్ బీటెక్ సినిమా తెలుగులో రామ్ పోతినేని హీరోగా రీమేక్ చేయాలని భావించారని, అయితే చివరి నిమిషంలో నిర్మాతలు ఈ ప్రాజెక్టును వదిలేసి డబ్బింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
రఘువరన్ బీటెక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు సంభాషణలు రాసిన దర్శకుడు కిషోర్ తిరుమల అసలు కథను తెలిపారు.
కిషోర్ తిరుమల మాట్లాడుతూ.." రఘువరన్ బీటెక్ చిత్రాన్ని మొదట తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. అదే సమయంలో నేను శైలజా కి కూడా నాకు ఆమోదం లభించింది. అయితే నేను శైలజ చిత్రంతోనే నేను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. అటు రఘువరన్ బీటెక్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు ధనుష్ ను హృదయపూర్వకంగా స్వాగతించారు. ఆయన వెంటనే స్టార్ గా మారడానికి వీలు కల్పించారు.
అయితే దీనిని రామ్ రీమేక్ చేసి ఉంటే ఇంత విజయవంతం అయ్యేది కాదు. ఎందుకంటే ఒరిజినల్ కి రీమేక్ కి మధ్య స్పష్టమైన తేడాలు తలెత్తేవి. అదృష్టవశాత్తు రామ్ తెలివిగా ఈ సినిమా నుండీ వెనక్కి తగ్గి విమర్శల నుండి తప్పించుకున్నాడు అంటూ కిషోర్ తిరుమల చెప్పుకొచ్చారు ఇకపోతే ఆ తర్వాత కిషోర్ తిరుమల రామ్ తో ఉన్నది ఒకటే జిందగీ సినిమా చేశారు.