మాట విన‌క‌పోవ‌డమే అంత‌టి వాడిని చేసింది!

రౌడీబోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎలా ఎదిగాడు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2026-01-07 23:30 GMT

రౌడీబోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎలా ఎదిగాడు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంతింతై వ‌టు డింతైన చందంగా సినీ రంగంలో ఎదిగాడు. `పెళ్లి చూపులు` అనే చిన్న సినిమా అత‌డి జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమా స‌క్సెస్ అవ్వ‌డం..విజ‌య్ స్లాంగ్ ప్ర‌త్యేకించి ఆంధ్రా ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అవ్వ‌డంతో? విజ‌య్ క్లిక్ అయిపో యాడు. తొలి సినిమాతోనే గొప్ప విజ‌యాన్ని అందుకున్నాడు. అటుపై `అర్జున్ రెడ్డి` బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో? పాన్ ఇండియాలోనే గుర్తింపు ద‌క్కింది. అక్క‌డ నుంచి విజ‌య్ ప్ర‌యాణం అంతా సాఫీగా సాగిపోతుంది.

నేడు విజ‌య్ అంటే ఓ బ్రాండ్ గా సినిమాలు మార్కెట్ అవుతున్నాయి. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తెలంగాణ ప్రాంతం నుంచి నేచుర‌ల్ స్టార్ నాని త‌ర్వాత అంత‌టి వాడిగా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు. అయితే విజ‌య్ ఇంత‌టి వాడు అవ్వ‌డానికి కార‌ణం త‌న‌లో ఉన్న కొన్ని రేర్ క్వాలిటీలు కూడా కీ రోల్ పోషించాయి అన్న‌ది అత‌డి మేన మామ య‌శ్ రంగినేని మాటల్లో బ‌య‌ట ప‌డుతుంది. ఇత‌డు సినిమాల్లో నిర్మాత‌గా, న‌టుడిగా ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌లే రిలీజ్ అయిన `ఛాంపియ‌న్` సినిమాలో వీర‌య్య పాత్ర మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఎవ‌రి మాట వినే స్వ‌భావం క‌లవాడు కాదు అన్నారు. పుట్టిన‌ప్ప‌టి నుంచి కూడా విజ‌య్ తీరు అలాగే ఉండేద‌న్నారు. ఇంట్లో త‌ల్లిదండ్రుల మాట‌లు విన‌డు. వృత్తి, వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి విజ‌య్ సొంత నిర్ణ‌యాలే తీసుకుంటాడుట‌. వాటిని షేర్ చేయ‌డం..అభిప్రాయం తీసుకోవ‌డం గానీ ఉండ‌ద‌న్నారు. అత‌డు ఏది అనుకుంటే అది చేయ‌డం త‌ప్ప‌? అందులో త‌ప్పు రైట్ ఆలోచించ‌డ‌ని అన్నారు. ఏ ప్ర‌య‌త్నం చేసినా చాలా మెండిగా చేస్తాడ‌న్నారు. చాలా కాలం పాటు తాను కూడా విజ‌య్ కి దూరంగా ఉన్నాన‌ని...త‌న చెల్లెలు చెబుతుంటే విన్నాన‌న్నారు. ఆ త‌ర్వాత అత‌డిని ద‌గ్గ‌ర‌గా వాచ్ చేసిన‌ట్లు తెలిపారు.

తాను ఏ ప‌నికి సంక‌ల్పించినా? అది మంచైనా..చెడు అయినా వెన‌కా ముందుకు ఆలోచిచ‌కుండా వెళ్తాడ‌న్నారు. చాలా క్లారిటీతో..క్లియ‌ర్ గా ముందుకెళ్తాడ‌న్నారు. ఒక నిర్ణయమంటూ తీసుకుంటే దానిని ఆచరణలో పెట్టే వ‌ర‌కూ నిద్ర‌పోడన్నారు. తాను తీసుకునే నిర్ణ‌యాల విష‌యంలో ఎంత మాత్రం త‌డ‌బాటు ఉంద‌ని, ఒక‌సారి డిసైడ్ అయితే ? మళ్లీ ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునే స్వ‌భావం క‌ల‌వాడు కాద‌న్నారు. ఓపెన్ హార్ట్ తో మాట్లాడ‌టం విజ‌య్ ప్ర‌త్యేక‌త‌ అన్నారు. మ‌న‌సులో ఒక‌టుంచుకుని బ‌య‌ట మ‌రోలా మాట్లాడ‌టం అత‌డికి ఎంత మాత్రం తెలియ‌ద‌ న్నారు. కానీ ఈ ర‌క‌మైన ప్ర‌వ‌ర్త‌న కార‌ణం గా భ‌విష్య‌త్ లో చాలా స‌వాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Tags:    

Similar News