అభిమానులు ఊహించని ఓ అద్బుతమే ఇది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' అనే రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత అభిమానుల్లో సంతోషంతో పాటు నైరాశ్యం కూడా కనిపించింది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' అనే రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత అభిమానుల్లో సంతోషంతో పాటు నైరాశ్యం కూడా కనిపించింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోతే వెండి తెరపై దేవుడుని చూసుకునే అవకాశం కలగదని ఎంతో మదన పడ్డారు. ప్రజల బాగుకోరే గొప్ప మనసు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కేవలం సినిమాలకే పరిమితమైతే? అతడు కలలు గన్న స్వరాజ్యం ఏమైపోవాలి? అని మనసుకు సర్దిచెప్పుకున్నా సినిమాలు చేయరనే బాధ మాత్రం ప్రతీ అభిమాని గుండె నిండా కనిపించింది. రాజకీయ ప్రసంగాల్లోనే పవన్ కనిపిస్తారని...అక్కడ చూసుకుని మురిసి పోవడం తప్ప మ్యాకప్ వేసుకోవడం సాధ్యం కాదని చాలా మంది అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేసారు.
కానీ పూర్తి చేయాల్సిన సినిమాల కారణంగా పవన్ పార్టీ స్థాపన వెంటనే సినిమాలకు దూరం కాలేదు. సినిమాలు చేస్తూనే పార్టీని ముందుకు నడిపించుకుంటూ వచ్చారు. రాజకీయంలో ఎలాంటి గురువు లేకపోవడంతో? అన్ని తానై నేర్చుకున్నారు. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. చివరకు తన సిద్దాంతాలను సైతం వదిలేసి సరికొత్త పంథాలో రాజకీయం చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం పవన్ అనుసరిస్తోన్నది అదే సిద్దాంతం. దీనిలో భాగంగానే టీడీపీ, జనసేన పార్టీలో కలిసి పని చేస్తున్నారు. అయితే పవన్ సినిమా ప్రయాణం మాత్రం అభిమానులు ఎంత మాత్రం ఊహించని విధంగానే సాగుతుంది? అన్నది అంతే వాస్తవం.
ఇప్పుడు సినిమాలపై పవన్ ఆసక్తి మరింత రెట్టింపు అయింది. ఇలా జరుగుతుంది? అని అభిమానులెవరూ ఊహించలేదు. క్రమ క్రమంగా సినిమాలు తగ్గించుకుంటూ వస్తారనుకుంటే? అదే సినిమాల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నారు. మరో 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి పని చేస్తాను? అన్న ప్రకటనతో పవన్ రాజకీయ ప్రయాణం ఇప్పట్లో సోలోగా ఉండదని తేలిపోయింది. అంటే మరో 15 ఏళ్ల పాటు పవన్ ఎంచక్కా సినిమాలు చేసుకునే అవకాశం ఉన్నట్లే. అందుకు తగ్గ ప్రణాళిక సిద్దం చేసుకునే పవన్ ముందుకెళ్తున్నారు.
పవన్ ఎమ్మెల్యేగా గెలిచాక, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాక ఈ దశలో ఇలా జరుగుతుందని అభిమానుల ఊహకి కూడా రాలేదు. ఏ క్షణమైనా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారు? అనే ఆలోచన తప్ప సినిమాల లైనప్ పెరుగు తుందని మాత్రం ఊహించలేదు. పవన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ సన్నివేశం మొత్తం ఇలాగే ఉంది. ఆ రకంగా పవన్ సినిమా అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అభిమానుల్లో కూడా పవన్ రాజకీయ భవిష్యత్ గురించి కూడా పెద్దగా చర్చ జరుగుతున్నట్లు కనిపించలేదు. పవన్ అదేశాల మేరకు అంతా నడుచుకుంటున్నారు.