అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రగ్యా జైస్వాల్!

ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా కొత్త ఏడాది సందర్భంగా కొత్త ఆరంభం అంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ..అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది;

Update: 2026-01-07 18:30 GMT

ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా కొత్త ఏడాది సందర్భంగా కొత్త ఆరంభం అంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ..అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. కొత్త ఏడాదిలో భాగంగా గ్లామర్ వలకబోస్తూ మినీ స్కర్ట్ ధరించిన ఈమె.. తన అందాలతో మరొకసారి అభిమానులను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా భిన్నమైన ఫోజులు ఇస్తూ అభిమానులను రిఫ్రెష్ చేసింది. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత మరింత గ్లామర్ గా కనిపిస్తూ కొత్త ఏడాది మరింత కొత్తగా అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది ప్రగ్యా జైస్వాల్.



 


2014లో విరాట్టు అనే చిత్రం ద్వారా కోలీవుడ్ సినీరంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత 2015లో పీరియాడికల్ డ్రామా మూవీ కంచె ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా ఉత్తమ తొలి మహిళ అరంగేట్రం విభాగంలో సౌత్ ఫిలింఫేర్ అవార్డు లభించింది. అంతేకాదు ఇటీవల గద్దర్ అవార్డు కూడా లభించింది. తమిళ్, తెలుగు మాత్రమే కాకుండా టిటూ ఎంబీఏ అనే చిత్రంతో హిందీ రంగ ప్రవేశం కూడా చేసింది. అలాగే నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర , అఖండ వంటి చిత్రాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది.



 


1991 జనవరి 12న మధ్యప్రదేశ్లో జన్మించిన ఈమె చిన్నతనం నుంచే కళ మరియు సంస్కృతి రంగంలో ప్రావీణ్యం పొంది, అనేక సాంస్కృతిక పురస్కారాలను కూడా దక్కించుకుంది. ఇకపోతే అఖండ సినిమా తర్వాత డాకు మహారాజ్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అఖండ 2 లో కేవలం ఆమె ఫోటోను మాత్రమే ఉపయోగించారు.. ప్రస్తుతం టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో కొనసాగుతోంది. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



 


మరోవైపు సన్నీ డియోల్ తో కలిసి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఎం.పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూర్య అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం జైపూర్లో షూటింగ్ జరుపుకుంటుంది . ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె గ్లామర్ తోనే ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగితే సినిమాలలో మరింతగా అవకాశాలు పెరుగుతాయనే ఆలోచన కూడా చేస్తున్నట్లు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రగ్యా జైస్వాల్ అందానికి, అభినయానికి వరుస అవకాశాలు రావాలి అని, ఈ ఏడాది ఫుల్ బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ప్రగ్యా జైస్వాల్ కి ఈ కొత్త ఏడాది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.



 


Tags:    

Similar News