డబ్బు పంపకం వాటర్ బాటిల్ షేరింగ్ లా!
అవసరమైతే రూపాయి వదులకుంటారు గానీ బంధాలు మాత్రం బీటలు వారడానికి ఎంత మాత్రం ఒప్పుకోరు. డబ్బు ఈ రోజుకాకపోతే రేపు సంపాదిస్తాం. డబ్బు దేముంది? నాన్సెన్స్ అంటారు ఆ త్రయం.;
డబ్బు కారణంగా ఎన్నో కుటుంబాలు విశ్చినమైపోయాయి. భార్య భర్తలు విడిపోతున్నారు. అన్నదమ్ములు.. తోబుట్టువులు దూరమవుతున్నారు. కుటుంబంలో బంధాలు బలహీన పడుతున్నాయి. విలువైన జీవితాలను కోల్పోతున్నారు. ఇలా ఒకటేంటి? ధనమే సర్వాంతర్యామిగా భావిస్తే అన్నీ సమస్యలే. వేల..లక్షలు కోట్లు సంపాదించిన వారు సైతం ధనం అనే మత్తులో కూరుకుపోయి ఎంతో కోల్పోతున్నారు. డబ్బును..జీవితాన్ని బ్యాలెన్స్ చేయడలో ఎంతో మంది విలమై ఛిద్రమైపోతున్నారు. ఈ ఉచ్చులో ఎన్నో సెలబ్రిటీ కుటుంబాలు కూడా ఉన్నాయి.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ ఇలా దేశంలో ఏ పరిశ్రమను తీసుకున్నా? డబ్బు కారణంగా దూరమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ముగ్గురు అన్నదమ్ములు...తోటి కోడళ్లు మాత్రం ఓ అద్భుతమనే చెప్పాలి. వారి మధ్య డబ్బు ఏనాడు ఎలాంటి సమస్యను తెచ్చి పెట్టలేదు. అవసరమైతే రూపాయి వదులకుంటారు గానీ బంధాలు మాత్రం బీటలు వారడానికి ఎంత మాత్రం ఒప్పుకోరు. డబ్బు ఈ రోజుకాకపోతే రేపు సంపాదిస్తాం. డబ్బు దేముంది? నాన్సెన్స్ అంటారు ఆ త్రయం.
ఇంతకీ ఎవరా ముగ్గురు బ్రదర్స్ అంటే? సాయి కుమార్, రవి శంకర్, అయ్యప్ప వర్మ. ముగ్గరు సినీ రంగంలో రాణిస్తున్న వారే. వారి మధ్య అన్యోన్యత ఎంత అందంగా ఉంటుందంటే? స్నేహితుల్ని మించి గొప్ప స్నేహితులుగా ఉంటామంటున్నారు. సాయి కుమార్ -రవి శంకర్ నటులుగా స్థిరపడి బాగానే సంపాదించారు. వారికి కావాల్సిన వన్నీ అన్నీ సమకూర్చుకున్నారు. జీవితం సంతోషంగా సాగిపోతుంది. అయ్యప్ప శర్మ కూడా నటుడిగా పనిచేస్తున్నాడు. అయితే సాయి కుమార్, రవి శంకర్ కంటే డబ్బు అవసరం తనకే ఎక్కువగా ఉంటుందని...వాళ్లని తానే అడిగి తీసుకుంటానన్నారు అయ్యప్ప.
ఈ విషయంలో ఎంత మాత్రం మెహమాటం ఉండదని..వాళ్లు కూడా తనని అర్దంచేసుకుని అడిగిన వెంటనే ఇస్తారన్నారు. ఇప్పటి వరకూ సాయి...శంకర్ ని అవసరం కొద్ది తానే డబ్బు అడిగాను తప్ప వాళ్లు ఎప్పుడు తనని అడగ లేదన్నారు. తీసుకున్న ఆ డబ్బును కూడా అంతే బాధ్యతగానూ తిరిగి ఇచ్చేస్తానన్నారు. అన్నదమ్ముల మధ్య డబ్బు పంపిణీ అన్నది లీటర్ వాటర్ బాటిల్ షేర్ చేసుకున్నంత ఈజీగా షేర్ చేసుకుంటామన్నారు. తమ మధ్య ఎప్పుడు డబ్బు విషయంలో అలకలు లేవన్నారు. ఎప్పుడైనా అలకలు వచ్చాయంటే? శుభకార్యాలకు ఢుమ్మా కొట్టిన సందర్భంలో ఒకరి మీద ఒకరు అలుగుతామన్నారు. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని జీవితం సంతోషంగా సాగిపోతుందన్నారు.