• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ మూవీకి కమ్ముల...

చైతూ మూవీకి కమ్ముల మార్క్‌ టైటిల్‌

By - Tupaki Desk
Update: 2019-10-31 05:03 GMT
టాలీవుడ్‌ విలక్షణ దర్శకుల జాబితాలో శేఖర్‌ కమ్ముల ముందు వరుసలో ఉంటారు. ఈయన చేసే ప్రతి సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఫిల్మ్‌ అంటూ టాక్‌ సొంతం చేసుకుంటుంది. ఇక ఈయన కెరీర్‌ ఆరంభం నుండి కూడా విలక్షణమైన చాలా సింపుల్‌ టైటిల్స్‌ ను పెడుతూ వస్తున్నాడు. ఆనంద్‌.. గోదావరి.. హ్యాపీ డేస్‌.. ఫిదా ఇలా ప్రతి సినిమాకు కూడా తనదైన శైలిలో అందరిలో ఈజీగా నోటెడ్‌ అయ్యే టైటిల్స్‌ ను పెడుతూ వస్తున్నాడు. టైటిల్స్‌ విషయంలో శేఖర్‌ కమ్ములకు ఒక మార్క్‌ అంటూ ఏర్పడింది.

ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్యతో శేఖర్‌ కమ్ముల ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుందట. డిసెంబర్‌ లో సినిమాను పూర్తి చేసి సంక్రాంతి సీజన్‌ తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారట. తాజాగా ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల తనదైన మార్క్‌ తో సింపుల్‌ టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఒక విభిన్నమైన ప్రేమ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి 'లవ్‌ స్టోరీ' అనే సింపుల్‌ టైటిల్‌ ను దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఖరారు చేశారట. ఈ విషయాన్ని అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని త్వరలోనే చివరి షెడ్యూల్‌ కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. శేఖర్‌ కమ్ముల 'ఫిదా' తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి లవ్‌ స్టోరీ టైటిల్‌ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది.
Tags:    
  • Naga Chaitanya 
  • Sekhar Kammula 
  • Sai Pallavi 
  • Love Story 
  • Venky Mama 
  • Tupaki News 

Similar News

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

Copyright @2026

Powered by Blink CMS