• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సెబాస్టియన్ P.C.524'...

'సెబాస్టియన్ P.C.524' టీజర్: రేచీకటితో బాధపడే పోలీసోడి కథ..!

By - Tupaki Desk
Update: 2022-02-05 05:50 GMT
'SR కల్యాణమండపం' తో కమర్షియల్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ''సెబాస్టియన్ పి.సి. 524''. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నమ్రతా దారేకర్ - కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 25వ తేదీన తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇప్పటికే ''సెబాస్టియన్ P.C. 524'' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ లో భాగంగా చిత్ర టీజర్ ని ఈరోజు శనివారం మేకర్స్ రిలీజ్ చేసారు. రేచీకటితో బాధపడే పోలీసు కానిస్టేబుల్‌ గా కిరణ్ అబ్బవరం ఇందులో కనిపిస్తున్నారు. 'నీకు రేచీకటి అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వద్దు అయ్యా' అని హీరో తల్లి చెప్పడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది.

మదనపల్లె అనే ప్రాంతంలో కానిస్టేబుల్ గా పనిచేసే సెబాస్టియన్.. తనకున్న నైట్ బ్లైండ్నెస్ లోపాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ కామెడీ థ్రిల్లర్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎలాంటి కేసు రాకూడదని కోరుకునే సెబాస్టియన్.. ఓ రాత్రి సమయంలో జరిగిన మర్డర్ మిస్టరీని చేధించాల్సి వచ్చిందని టీజర్ ని బట్టి అర్థం అవుతుంది.

మొత్తం మీద 'సెబాస్టియన్ P.C. 524' టీజర్ ఆద్యంతం అలరిస్తూనే ఉత్కంఠకు గురి చేస్తూ సాగింది. రేచీకటి ఉన్న యువకుడిగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం మంచి ఈజ్ తో నటించాడు. దేవుడి బిడ్డలు రావని ఫాస్టర్ చెప్తుంటే.. 'అంటే నేను దేవుని బిడ్డను కాదన్నమాట' అని కిరణ్ చెప్పే డైలాగ్ అలరిస్తోంది. రోహిణి - సూర్య - ఆదర్శ్ బాలకృష్ణ - శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. జిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ - రాజ్ కె.నల్లి సినిమాటోగ్రఫీ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది. విప్లవ్ ఈ సినిమాకు ఎడిటింగ్ వర్క్ చేసారు.

ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై ప్రమోద్-రాజు లు సంయుక్తంగా నిర్మించారు. సిద్దారెడ్డి - జయచంద్రా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వరుస సినిమాతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బ‌వ‌రం.. పెద్ద సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తున్న 'సెబాస్టియన్ P.C. 524' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Full View





Tags:    
  • SebastianPC524 
  • Kiran Abbavaram 
  • Nuveksha 
  • Komalee Prasad 
  • Balaji Sayyapureddy 
  • Ghibran 
  • teamkiranabbavaram 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS