కమెడియన్ సత్య దింపేశాడుగా..

Update: 2023-06-30 10:35 GMT
ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో  ఉన్న యంగ్ టాలెంటెడ్ కమెడియన్స్ లో సత్య ఒకరు. ఇప్పటికే చాలా మంది  హీరోల సినిమాల్లో నటిస్తూ  తన కామెడీ టైమింగ్, హావాభావాలతో హాస్యనటుడిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే  ఈమధ్య కాలంలో ఆయన కాస్త తక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నారు.  ఇప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి రంగబలి సినిమాతో  కడుపుబ్బా నవ్వించేందుకు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన హీరో నాగశౌర్యను ఓ ఫన్నీ స్ఫూఫ్ ఇంటర్వ్యూ చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. అదేంటంటే..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటించిన కొత్త చిత్రం  రంగబలి.. జూలై 7న  రిలీజ్ కానుంది.  ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ జోష్ లో సాగుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన  ట్రైలర్ సినీ ప్రియుల్లో మూవీపై ఆసక్తిని కూడా పెంచింది. అందుకు ప్రధాన కారణం ప్రచార చిత్రంలో నాగశౌర్య యాక్టింగ్ తో పాటు సత్య కామెడీ టైమింగ్, డైలాగ్స్ అనే చెప్పాలి.  

స్పెర్మ్ ను రోడ్ మీద తేనె అమ్మినట్టు అమ్మేద్దాం అంటూ ఆయన ఫన్నీగా చెబుతూ ఉండే డైలాగ్ ప్రచార చిత్రానికే హైలైట్ గా నిలిచింది. అంటే రంగబలి సినిమా పక్కా కమర్షియల్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని అర్థమైంది.

తాజా ప్రమోషన్స్ లోనూ  సత్య..  నాగశౌర్యను ఫన్నీ ఫన్నీగా ఓ స్పూఫ్ ఇంటర్వ్యూ చేశారు. దానికి సంబంధించిన  ప్రోమో ప్రస్తుతం నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇందుకు కారణం..  కమెడియన్ సత్య కొంతమంది వివాదస్పద యాంకర్స్ ను ఇమిటేట్ చేస్తూ వారిలా గెటప్ వేసుకుని నాగశౌర్యను ఇంటర్వ్యూ చేయడం.  అలానే ఆ యాంకర్స్ స్టైల్ లో కొన్ని వివాదస్పద ప్రశ్నలను కూడా అడిగి ఆడియెన్స్ లో ఆసక్తిని పెంచారు. మొత్తం ఐదు భాగాలుగా ఇంటర్వ్యూ చేస్తూ  ఫన్నీ ఫన్నీగా ఇమిటేట్ చేశారు.

అలా సత్య చాలా బాగా ఇమిటేట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో ఈ ప్రోమో బాగా వైరల్ గా మారింది.  ప్రోమో చివర్లో ఓ న్యూస్ ప్రెజెంటర్ లో ఇమిటేట్ చేస్తూ.. గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ అరవడం బాగా హైలెట్ గా నిలిచింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు..  కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ..  సినిమా ప్రమోషన్స్ ‌లో బిగ్ హిట్  అవుతుందని అంటున్నారు. ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పవన్ భాసం శెట్టి  పరిచయం కానున్నారు. నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. పవన్ సిహెచ్ సంగీతమందించిన పాటలు ఇప్పటికే  బాగా ఆకట్టుకున్నాయి. ఆడియెన్స్  నుంచి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు. చూడాలి మరి ఈ రంగబలి సినిమా నాగశౌర్య కి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో...


Full View

Similar News