ప్రభాస్ గౌరవమే వేరు.. బీటౌన్ లో అది చచ్చిపోయింది: బాలీవుడ్ సీనియర్ నటి
ఇప్పుడు బీటౌన్ సీనియర్ నటి జరీనా వాహబ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.;
బాలీవుడ్ కు చెందిన అనేక మంది నటీనటులు టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలుగు ఇండస్ట్రీ తీరును కొనియాడుతుంటారు. కలిసి పనిచేసిన క్యాస్టింగ్ కోసం మాట్లాడుతుంటారు. ఇప్పుడు బీటౌన్ సీనియర్ నటి జరీనా వాహబ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ లో కొన్నేళ్లుగా రాణిస్తున్న జరీనా వాహబ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా అందరినీ మెప్పించిన ఆమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్నారు. పలు గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించి మెప్పించారు. అగ్నిపథ్ సహా అనేక చిత్రాల్లో కీలకమైన రోల్స్ లో యాక్ట్ చేసి అదరగొట్టారు. ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు జరీనా వాహబ్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో మారుతి తెరకెక్కిస్తున్న ఆ సినిమా.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రాజా సాబ్ లో జరీనా.. కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ నాన్నమ్మగా కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.
సినిమాలో వారిద్దరి మధ్య సీన్స్.. అందరినీ ఆకట్టుకుంటాయని మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు. ఫుల్ ఎమోషన్ తో కూడిన ఆ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని సినీ వర్గాల్లో టాక్. దీంతో ఆడియన్స్, ఫ్యాన్స్.. వారి మధ్య సీన్స్ చూసేందుకు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జరీనా వాహబ్.. ఓ ఈవెంట్ లో రాజా సాబ్ సినిమా కోసం మాట్లాడారు. మూవీ ఆఫ్ స్క్రీన్ లో తన అనుభవాలను షేర్ చేసుకున్నారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు జరీనా. ముఖ్యంగా ఓ కొత్త వ్యక్తిలా కాకుండా.. ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేశారని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభాస్ తన పట్ల చాలా గౌరవంతో బిహేవ్ చేశారని చెప్పారు. సెట్స్ లో ఆయన డెడికేషన్ చూసి షాక్ అయ్యానని చెప్పిన ఆమె.. ప్రభాస్ గౌరవం వేరని అన్నారు. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారని, అందరినీ సమానంగా చూస్తారని చెప్పారు.
ఆ తర్వాత బాలీవుడ్ లో ఫ్యామిలీ మూవీ స్టోరీలు మెల్లగా మాయమవుతున్నారని అభిప్రాయపడ్డారు జరీనా. అక్కడ సినిమాల్లో ఫ్యామిలీ అనే భావనే చనిపోయినట్టు ఉందంటూ కామెంట్ చేశారు. కానీ టాలీవుడ్ లో ఇప్పటికీ ఫ్యామిలీ వాల్యూస్ తో పాటు ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తారని, అలాంటి కథలకు తాను కనెక్ట్ అవుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం జరీనా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.