క్లాస్ టైటిల్ తో మసాలా ట్రీట్..?
మాస్ మహరాజ్ రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వస్తున్నారు.;
మాస్ మహరాజ్ రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వస్తున్నారు. లాస్ట్ ఇయర్ మాస్ జాతర తో నిరాశపరిచిన రవితేజ భర్త మహాశయులకు సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు. రవితేజ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది.
సంక్రాంతికి పర్ఫెక్ట్ జోష్..
అంతేకాదు ఇద్దరి భామల మధ్య హీరో నలిగిపోయే సినిమాలు తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. ఈ క్రమంలో రవితేజ నుంచి ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ తర్వాత వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి పర్ఫెక్ట్ జోష్ ఇస్తుందని అంటున్నారు. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ కిషోర్ తిరుమల సినిమాలో హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్ బాగుంటుందని అన్నారు. సినిమాలో ఆషిక ఫ్రాన్స్ లో ఉంటుంది. అక్కడ ఆమె సీన్స్ ఇంకా గ్లామర్ సీన్స్ అన్నీ ఆకట్టుకుంటాయని అన్నారు.
ఇక సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన వామ్మో వాయ్యో మాస్ సాంగ్ ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో రవితేజ మాస్ ట్రీట్ ఇవ్వగా అది స్టోరీకి సంబంధం లేకుండా వస్తుందని అన్నారు. ఇప్పటికే భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మీద మంచి హైప్ తెచ్చాయి. రవితేజ ఎనర్జీకి సరిపోయే కథతో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి పక్కా ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి..
మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా సూపర్ ఎంటర్టైన్ అందించేలా ఉంది. ఐతే ఫ్యామిలీ సినిమా అయినా కూడా మాస్ రాజా ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. సంక్రాంతి సినిమాల సందడిలో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సంథింగ్ స్పెషల్ మూవీగా రాబోతుంది. మరి ఈ సినిమాపై మాస్ రాజా ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఏం చేస్తారన్నది చూడాలి.
రవితేజ ఈమధ్య ఎక్కువ మాస్ బ్యాక్ డ్రాప్ కథలతోనే వస్తున్నారు. అందుకే ఆయనకు సక్సెస్ దూరమైంది. చివరగా వచ్చిన మాస్ జాతర సినిమా కూడా తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది. ఐతే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. మాస్ జాతర వచ్చి రెండు నెలలు అవుతుందో లేదో భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి ఫ్యాన్స్ ముందుకొస్తున్నారు.
ఈ సినిమా తర్వాత రవితేజ శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పనిచేస్తారని టాక్. ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో రవితేజ సినిమా పడినా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మాస్ రాజా ఫ్యాన్స్ భావిస్తున్నారు.