రాజా సాబ్ మారుతి.. ఇది కదా డెడికేషన్ అంటే..!
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా ల్యాబ్ లో చిన్న చిన్న పనులు చేయిస్తున్నారు డైరెక్టర్ మారుతి.;
రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా ల్యాబ్ లో చిన్న చిన్న పనులు చేయిస్తున్నారు డైరెక్టర్ మారుతి. సినిమా రిలీజ్ మరో రెండు రోజులే ఉన్న కారణంగా ఎల్.వి ప్రసాద్ ల్యాబ్ లో నిద్ర లేకుండా మారుతి కష్టపడుతున్నారు. లేటెస్ట్ గా ప్రసాద్ ల్యాబ్ లో అలా ఒక వెయిటింగ్ టేబుల్ మీద మారుతి పడుకుని సేదతీరుతున్న ఫోటో బయటకు వచ్చింది. అది చూసిన సినీ లవర్స్ సూపర్ అనేస్తున్నారు.
డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్
హీరో, హీరోయిన్స్ మిగతా కాస్టింగ్, ఆఖరికి టెక్నీషియన్స్ కూడా సినిమా షూటింగ్ అయ్యాక రిలాక్స్ అవుతారు. కానీ కొంతమంది సాంకేతిక వర్గం తో డైరెక్టర్ సినిమా రిలీజ్ వరకు కష్టపడుతూనే ఉంటాడు. అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని డైరెక్టర్ ని అంటారు. రాజా సాబ్ సినిమా విషయంలో మారుతి తన మీద ప్రభాస్ మాత్రమే కాదు రెబల్ ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని నిద్రలేకుండా కష్టపడుతున్నాడు.
మారుతి ఈ సినిమా మొదలైనప్పుడు రెబల్ ఫ్యాన్స్ నుంచి కాస్త నెగిటివిటీ వచ్చింది. ఇప్పటికీ థర్డ్ సాంగ్ విషయంలో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేశారని ఫైర్ అవుతున్నారు. కానీ దాని వెనకాల వాళ్లు పడే కష్టం ఎవరికీ కనిపించదు. మరో రెండు రోజుల్లో రాబోతున్న రాజా సాబ్ సినిమా గురించి ప్రసాద్ ల్యాబ్ లో పని చేయిస్తున్న మారుతిని చూసి డెడికేషన్ అంటే ఇది అనేస్తున్నారు ఆడియన్స్.
మారుతి పడుతున్న కష్టానికి.. పెడుతున్న ఎఫర్ట్స్..
ఐతే మరికొందరు మాత్రం సినిమా డిసెంబర్ రిలీజ్ అనుకున్నారు కదా అప్పటికే సినిమా రెడీ చేయాలి నెల తర్వాత వస్తున్నా ఇంకా పనులు ఎందుకు అంటున్నారు. సినిమా రిలీజ్ కు టైం వచ్చింది కాబట్టి ఇంకాస్త దాన్ని మెరుగులు దిద్దాలనే ఆలోచన ఉంటుంది. సో రాజా సాబ్ కోసం మారుతి పడుతున్న కష్టానికి.. పెడుతున్న ఎఫర్ట్స్ కి తగిన ఫలితం వస్తుందేమో చూడాలి.
మారుతి ప్రభాస్ కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు. రాజా సాబ్ ప్రమోషనల్ కంటెంట్ అయితే అదిరిపోయింది. ట్రైలర్ కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటు విజువల్ క్వాలిటీ అదే గ్రాఫిక్స్ కూడా ఆడియన్స్ కి నచ్చితే మాత్రం సినిమాతో మరోసారి రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా ప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ తో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోతాడు.