ప్రభాస్ 'రాజా సాబ్'.. ఎంత రాబట్టాలంటే?

అయితే సినిమాను మారుతి తెరకెక్కించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.;

Update: 2026-01-07 08:20 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా.. జనవరి 9వ తేదీన థియేటర్స్ లో విడుదలై సినీ సంక్రాంతి పండుగ సందడి మొదలు పెట్టనుంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ కూడా ఉండగా.. మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు.

అయితే సినిమాను మారుతి తెరకెక్కించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొదట ఓ బడ్జెట్ అనుకోగా.. ఆ తర్వాత పెరిగిందట. దీంతో భారీ వ్యయంతో రూపొందించినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఖర్చు, విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ వర్క్, రెమ్యూనరేషన్స్ కలిపి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకు రాకపోయినా.. భారీ ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. ప్రభాస్ క్రేజ్, సినిమాపై ఉన్న బజ్ వల్ల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని, దీంతో పెద్ద నెంబర్ కే అమ్మినట్లు సమాచారం. అయితే ఇప్పుడు సినిమా హిట్ స్టేటస్ అందుకోవాలంటే ఎంత వసూలు చేయాలనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ విషయంపై డిస్కస్ చేసుకుంటున్నారు.

మూవీ బడ్జెట్‌ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిట్‌ గా నిలవాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్‌ లోనే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉందని లెక్కలు కడుతున్నారు. దీంతో అది భారీ టార్గెట్ అనే చెప్పాలి.

కానీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ టార్గెట్ ను అయినా రీచ్ అవ్వడం ఈజీనే. ప్రభాస్ క్రేజ్ బట్టి చూసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. నిజానికి.. మూవీపై మొదట్లో కాస్త బజ్ ఉన్నా.. ఆ తర్వాత మెల్లగా తగ్గిపోయింది. కానీ రీసెంట్ గా రిలీజైన ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై ఉన్న అంచనాలను పెంచేసింది. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని హోప్స్ క్రియేట్ చేసింది.

అదే సమయంలో ప్రభాస్ కు నార్త్ టు సౌత్ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు హిందీలోనూ ఎప్పుడూ భారీ వసూళ్లు సాధిస్తాయి. ఇప్పుడు రాజా సాబ్ పై సూపర్ బజ్ క్రియేట్ అయ్యి ఉంది. ప్రభాస్ ఫేమ్, భారీ బడ్జెట్, స్టోరీ, మారుతి దర్శకత్వం సహా అన్ని అంశాలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఏదేమైనా రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News