• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తారక్ కు అసలు కథే...

తారక్ కు అసలు కథే చెప్పలేదు

By - Tupaki Desk
Update: 2017-09-15 07:33 GMT
ఎలాంటి స్క్రిప్ట్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఒకటికి పది సార్లు చెయ్యాలా వద్దా అని చెక్ చేసుకుంటారని టాలీవుడ్ లో ఓ టాక్ ఉంది. అంతే కాకుండా ఆయన ఇతర టాప్ దర్శకులతో కూడా ఆ కథని పోస్ట్ మార్టం కూడా చేస్తారట. అయితే రీసెంట్ గా ఇదే తరహాలో ఒక హిట్ కొట్టిన దర్శకుడి కథను ఎన్టీఆర్ వినగానే నో చెప్పాడని టాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా తర్వాత దిల్ రాజు తో 'శ్రీనివాస కళ్యాణం' ఓకే చేశాడని వార్తలు వచ్చాయి. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకుడు అని కూడా చెప్పారు. అయితే ఎన్టీఆర్ ..సతీష్ చెప్పిన కథని వినగానే రిజెక్ట్ చేశాడని టాక్ వినిపించింది. అసలు ఇది ఇంతకీ నిజమేనా అనే కోణంలో ఆలోచిస్తే.. అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్ సన్నిహితులు చెప్పిన ప్రకారం.. అసలు ఎన్టీఆర్ ని దర్శకుడు సతీష్ వేగేశ్న అస్సలు కలవలేదట. కేవలం దిల్ రాజు మాత్రమే వెళ్లి తారక్ కి కొన్ని పాయింట్స్ ని చెప్పాడు. దీంతో తారక్  కి ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. వెంటనే వేగేశ్న ని మొత్తం కథని రెడీ చేసుకొని తన దగ్గరికి తీసుకురమ్మని తారక్ చెప్పాడట.

ప్రస్తుతం ఎన్టీఆర్ బిగ్ బాస్ ముగింపుకు వస్తోంది కాబట్టి అందులోనూ మరో వైపు జై లవకుశ రిలీజ్ కు రెడీ అవుతోంది గనక ఆ రెండు పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. దీంతో ఆ పనులన్నీ పూర్తయ్యాక సతీశ్ ఎన్టీఆర్ ను కలిసి ఫుల్ స్క్రిప్ట్ చెప్పేస్తాడట. అయితే సతీష్ కి స్టోరీ చెప్పడంలో మంచి అనుభవం ఉంది. ఆయన ఇంతకుముందు చాలా కథలకు  స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అందులోనూ శతమానం భవతి హిట్ అందుకున్నాడు. ఇక తారక్ కి కూడా ఫ్యామిలీ కథలంటే చాలా ఇష్టం. ఇక సతీష్ చెప్పే కథను ఎన్టీఆర్ ఏ మాత్రం రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదని తెలుస్తోంది.. ఇది సంగతి.
Tags:    
  • Satish Vegesna 
  • NTR 
  • TElugu NEws 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS