వేడి పెంచుతున్న‌ `స‌ర్కార్ వారి..` ముంద‌స్తు యాపారం

Update: 2020-09-14 15:00 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి బిజినెస్ ఎలా న‌డిపించాలో ప‌క్కాగా తెలుసు. అందుకేగా సొంత బ్యాన‌ర్ తో బిజినెస్ మేన్ గా అవ‌తారం ఎత్తి డీల్ సెట్ట‌ర్ గా దూసుకుపోతున్నాడు! అన్న గుస‌గుస‌లు టాలీవుడ్ లో వినిపిస్తుంటాయి. తాను న‌టించే ప్ర‌తి సినిమాకి మ‌హేష్ పెట్టుబ‌డులు పెడుతున్నారు. దీనివ‌ల్ల నిర్మాత‌కు ఆర్థిక భారం ప‌డ‌కుండా.. కొంత సాయం అవుతోంది. అదే స‌మ‌యంలో త‌న‌కు కూడా బాగానే గిట్టుబాటు అవుతోంది.

పెద్ద మొత్తాలు పారితోషికంగా ముందే తీసుకునే ప్రాతిప‌దిక కంటే ఆ పారితోషికాన్ని ఆ సినిమాకి పెట్టుబ‌డిగా వినియోగించ‌డం అనే ప్రాతిప‌దిక ఎంతో ఆలోచింప‌జేస్తుంది. ఇక దీనికి అద‌నంగా ఏరియా హ‌క్కులు.. శాటిలైట్ హ‌క్కులు అనువాద హ‌క్కుల్లోనూ వాటాలు ముట్ట‌జెబుతున్నారు.

ఇంత‌కుముందు మ‌హేష్ సినిమాల‌కు ఇలానే చేశారు. ఇక 2020 సంక్రాంతి మూవీ స‌రిలేరు నీకెవ్వ‌రుకు ముంద‌స్తు ఒప్పందాల రూపంలో భారీగానే ఆర్జించార‌ని టాక్ వినిపించింది. ఆ సినిమా చాలా ముందే బిజినెస్ పూర్తి చేసుకోవ‌డంతో కోట్ల‌లో ఆర్జించారు. ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట ప‌రిస్థితేమిటి? అంటే ఈసారి కూడా బిజినెస్ ప‌రంగా బాగానే వ‌ర్క‌వుట‌వుతోంద‌ట‌. `సర్కారు వారి పాట` షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి అమెరికాలో ప్రారంభం కానుంది. 50రోజుల పాటు సాగుతుంద‌ట‌. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం... ఈ మూవీ తెలుగు డిజిటల్ రైట్స్ స‌హా శాటిలైట్ హక్కులను విక్రయించారని తెలిసింది. దీనికోసం 35 కోట్లు చెల్లించేందుకు ప్ర‌ముఖ సంస్థ సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది. హిందీ స‌హా ఇత‌ర భాష‌ల శాటిలైట్ హ‌క్కుల వ్యాపారం .. అనువాద హ‌క్కుల వ్యాపారం ఇంకా పెండింగులో ఉన్నాయి.

కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ప్రధాన విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. 2021 సెకండాఫ్ లో రిలీజ్ చేసే విధంగా చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేస్తార‌ట‌. మైత్రి మూవీ మేకర్స్- 14 రీల్స్ ప్లస్ -జిఎంబి ఎంటర్ టైన్మెంట్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. థ‌మ‌న్ బాణీలు అందించే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News