ఫోటో స్టోరి: పంజా పిల్ల పిచ్చెక్కించింది

Update: 2017-06-25 08:03 GMT
మంగళూర్ భామ అయినా మస్కట్ లో పుట్టిన భామ సారా జేన్ డయాజ్. కటౌట్ నుంచి కాసింత డిఫరెంట్ గా తగిలే ఈ భామ.. ఇండియన్ మూవీస్ లో బాగానే వెలుగుతోంది. కౌంట్ పరంగా తక్కువగా ఉన్నా.. కంటెంట్ విషయంలో స్ట్రాంగ్ మూవీస్ నే ఎంచుకుని మరీ చేస్తున్న ఈ మిస్సిండియా బ్యూటి.. పంజా మూవీలో పవన్ తో కలిసి సందడి చేసింది.

ఆ తరువాత సౌత్ లో పెద్దగా ట్రై చేయలేదు కానీ.. బాలీవుడ్ లో మాత్రం ఏడాదికో సినిమా చొప్పున లాగించేస్తోంది. ఈ ఏడాది వైస్ రాయ్స్ హౌస్ అనే మూవీలో కనిపించింది కూడా.  అయితే.. పంజాలో అంటే పద్ధతిగా కనిపించింది కానీ.. వాస్తవానికి ఈ భామ ధరించే డ్రెస్సులు అలా ఉండవు. అల్ట్రా మోడర్న్ వెస్టర్న్ వేర్ లో విపరీతంగా కనిపించేస్తూ.. ఆన్ లైన్ జనాలకు ఎప్పటికప్పుడు షాకులు ఇచ్చేస్తూ ఉంటుంది సారా జేన్ డియాజ్. ఆదివారం రోజున తను ఎలా ఎంజాయ్ చేస్తోందో చెప్పేందుకు.. ఈ ఫోటో షేర్ చేసింది సారా!!

పంజా పిల్ల పోస్ట్ చేసిన ఈ పిక్ చూసిన వాళ్లకు పిచ్చెక్కిపోవడం ఖాయం. మైక్రో బికినీ వేర్ లో ఆ రేంజ్ లో అందాలతో విందు చేసేసింది సారా జేన్. 'హాయ్ ఆల్.. హ్యాపీ సండే' అంటూ పలకరిస్తోంది కానీ.. అందరి చూపులు అమ్మడి అందాలపైనే ఫోకస్ అయిపోతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News