సినిమాలు ప్లాప్ అవ్వడంతో వాళ్ళ స్టైల్ ను మార్చుకుంటున్న స్టార్ డైరెక్టర్స్...

సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ని స్టార్ట్ చేసిన చాలా మంది దర్శకులు వరుస సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక బ్రాండ్ నేమ్ ని క్రియేట్ చేసుకున్నారు.

Update: 2026-09-17 04:48 GMT

సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ని స్టార్ట్ చేసిన చాలా మంది దర్శకులు వరుస సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక బ్రాండ్ నేమ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆయా దర్శకులు చేసే సినిమాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్క ఆడియన్ కి అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్లు ఆ స్టైల్ లోనే సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూ వచ్చారు. మొత్తానికైతే పలానా దర్శకుడి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా ఎలా ఉండబోతుందనేది జనాలు ముందుగానే అంచనా వేయగలిగేలా వాళ్ళకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక అలాంటి దర్శకులకు ప్లాప్ లు రావడంతో వాళ్ళ పంథా ను పూర్తిగా చేంజ్ చేసి డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది...

కొరటాల శివ కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూనే అందులో ఏదొ ఒక మెసేజ్ ఉండేలా చూసుకునేవాడు. వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఆయన చిరంజీవితో చేసిన 'ఆచార్య' సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒకసారిగా తన రూటు మార్చి జూనియర్ ఎన్టీఆర్ తో 'దేవర' మూవీ చేశాడు. ఇందులో ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఉండడమే కాకుండా భారీ ఎలివేషన్స్ ఉండేలా చూసుకున్నారు. ఈ సినిమాతో తన పూర్తి స్టైల్ ని మార్చేశాడు. ఒక వంతుకు ఈ సినిమా పర్లేదు అనిపించినా కూడా భారీ సక్సెస్ ని అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఎన్టీఆర్ సైతం ఈ సినిమా మీద చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకొని విపరీతంగా కష్టపడ్డాడు. అయినప్పటికి సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నచ్చింది... అందరిని సంతృప్తి పరచలేకపోయింది. ఇప్పుడు బాలయ్య బాబు తో మరోసారి మాస్ సినిమా చేయడానికి కొరటాల శివ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు...

త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ కలగలిపిన సినిమాలను చేస్తూ వచ్చాడు. 'గుంటూరు కారం' సినిమాతో ప్లాప్ ను మూట గట్టుకున్నాడు. దాంతో ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో అలాంటి సినిమాలను మనం ఇవ్వాలి. మన స్టైల్ ని పూర్తిగా మార్చేయాలి అనే ధోరణిలో ఆయన ఆలోచించినట్టుగా తెలుస్తుంది. అందుకే ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో 'ఆదర్శ కుటుంబం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్ కు విరుద్ధంగా ఉండబోతుంది. ఒకరకంగా చెప్పాలి అంటే అనిల్ రావిపూడి ఎలాంటి సినిమాలు చేస్తాడో అలాంటి జానర్ లోనే ఆదర్శ కుటుంబం సినిమా కూడా సాగబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటి అనిల్ రావిపూడి స్టైల్ లో సినిమాలు చేయడం ఏంటి అంటూ కొంతమంది త్రివిక్రమ్ అభిమానులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆదర్శ కుటుంబం నుంచి విడుదలైన గ్లింప్స్ ని చూస్తే గురూజీ పక్కగా అనిల్ స్టైల్ ను దింపేస్తున్నాడనే విషయం ఈజీగా అర్థమవుతుంది. అందుకే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు త్రివిక్రమ్ తన స్టైల్ ని పూర్తిగా మార్చేసి అనిల్ రావిపూడి ట్రాక్ లోకి వెళ్లిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు... ఇక దర్శకులు ఎప్పటికప్పుడు తమ స్టైల్ ను మార్చేసి కొత్త పంథా లో సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది. కానీ పక్క దర్శకుల స్టైల్ ని కాపీ చేసి సినిమాలు చేస్తే వీళ్ళు వాళ్ళ రూట్లోకి వెళ్లిపోయారనే విమర్శలను మూటగట్టుకోక తప్పదు...

Tags:    

Similar News