ఈ బాలీవుడ్ కుర్రది టాలీవుడ్ కు సై అంటోందా..??
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ కొత్త హీరోయిన్ లకు అవకాశాలు సిద్ధంగానే ఉంటాయి. అందుకే ఎప్పుడు ఏ భాష నుండి కొత్త హీరోయిన్ వస్తుందో చెప్పలేం. ప్రస్తుతం అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పరభాషా ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అలాగే వారి చేతినిండా సినిమాలతో బిజీ అవుతూ ఒకటి రెండు సినిమాలకే మంచి స్టార్డం అందుకుంటూ స్టార్స్ సరసన అవకాశాలు దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుండి హీరోయిన్స్ చాలామంది తెలుగులో అడుగు పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో హిట్స్ కూడా అందుకున్నారు. మహేష్ బాబుతో టాలీవుడ్ ఎంట్రీ చేసిన కృతిసనన్ - కియారా అద్వానీలు బాలీవుడ్ లో ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారు.
అలాగే దిశాపటాని - నేహాశర్మ- సోనారిక - అవికాగోర్ - కత్రినా కైఫ్ ఇలా చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. హిట్స్ పడితే కంటిన్యూ చేస్తున్నారు లేదంటే బాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు. త్వరలోనే బాలీవుడ్ నుండి యంగ్ హీరోయిన్స్ అలియా భట్ - అనన్యపాండే పాన్ ఇండియా సినిమాలతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలియా ఆర్ఆర్ఆర్ సినిమాతో.. అనన్య లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే మరో బాలీవుడ్ స్టార్స్ ఫ్యామిలీ నుండి ఓ కుర్రభామ తెలుగులో అరంగేట్రం సూచనలు కనిపిస్తున్నాయి. ఆ కుర్రది ఎవరో కాదు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.
2018లో కేదారనాథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అదే ఏడాది సింబా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. పటౌడీ నవాబ్ కుమార్తె కావడంతో సారాను ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. గతేడాది ‘లవ్ ఆజ్ కల్’ సినిమాతో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నాజూకు సారాను చూసి దేశవ్యాప్తంగా యువత మనసు పారేసుకుంటున్నారు. సారాకి ఇన్‌స్టాగ్రామ్ లో 30 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒకప్పుడు లావుగా ఉండటంతో అసలు హీరోయిన్ గా కాదు కదా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాదని అందరూ విమర్శించిన వారికి దిమ్మతిరిగే రేంజిలో స్లిమ్ గా మారి షాకిచ్చింది. అయితే త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ చేసే ఆలోచనలో ఉందట. కరెక్ట్ స్క్రిప్ట్ తో పాటు స్టార్ హీరో సరసన అవకాశం వస్తే మాత్రం చేసేందుకు సిద్ధంగా ఉందట. ఇప్పటికే స్క్రిప్ట్స్ కూడా వింటుందట. మరి త్వరలో ఏ హీరోతో ఎంట్రీ ఇవ్వనుందో చూడాలి.