• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య ఊ అంటే షూటింగే...

బాలయ్య ఊ అంటే షూటింగే అంటున్న సీనియర్

By - Tupaki Desk
Update: 2016-07-17 17:30 GMT
1991 జులై 18.. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా విడుదలైంది. ఇప్పుడు చూసినా ఆ సినిమా నిత్యనూతనంగా అనిపిస్తుంది. ఈ తరం ప్రేక్షకులకు కూడా ఆ సినిమా ట్రెండీగా అనిపిస్తుంది. ఆ సినిమానే ‘ఆదిత్య 369’. సోమవారంతో ఈ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తవుతుండటం విశేషం. ఈ సందర్భంలోనే ‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999’ గురించి చర్చ జరుగుతుండటం విశేషం.

నిజానికి బాలయ్య వందో సినిమా ఇదే కావాల్సింది. ఓ దశలో ఈ సినిమా మొదలుపెట్టేయడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. కానీ తర్వాత బాలయ్య మనసు మార్చుకుని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేశాడు. ఐతే అంతమాత్రాన ‘ఆదిత్య 999’ ఆగిపోయినట్లు కాదని.. ఈ సినిమా కచ్చితంగా తెరకెక్కుతుందని అంటున్నాడు సింగీతం శ్రీనివాసరావు. బాలయ్య ఎప్పుడంటే అప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. స్టోరీ బోర్డుతో సహా స్క్రిప్టు సిద్ధంగా ఉందని ఆయన చెబుతున్నారు.

‘ఆదిత్య 369’ విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సింగీతం మీడియాతో మాట్లాడుతూ.. దీని సీక్వెల్ చేస్తే బాలయ్యే చేయాలని.. ఆయన కోసమే తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. బాలయ్య ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అని చెప్పిన సింగీతం.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కోసం ఇందులో ఓ పాత్ర తీర్చిదిద్దిన విషయం కూడా వాస్తవమే అన్నారు. తాను రాసుకున్న సీక్వెల్ కథను ఎప్పుడు తెరకెక్కించినా తాజాగానే అనిపిస్తుందని.. ‘ఆదిత్య 369’ లాగే ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుందని చెప్పారు. మరి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పూర్తయ్యాక అయినా బాలయ్య సింగీతంకు పచ్చ జెండా ఊపుతాడా?
Tags:    
  • Sangeetham Srinivasa Rao 
  • Aditya 369 Movie Sequel 
  • Telugu News 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS