స‌డెన్ షాకిచ్చిన అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు

Update: 2020-09-22 06:00 GMT
`అర్జున్ రెడ్డి` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. అదే చిత్రాన్ని  `క‌‌బీర్ సింగ్` పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి మ‌రోసారి బంప‌ర్ హిట్ కొట్టాడు. గత సంవత్సరం విడుదలైన  కబీర్ సింగ్ బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద టాలీవుడ్ ద‌ర్శ‌కుడి హ‌వా ఎలాంటిదో నిరూపించింది.

ఆ త‌ర్వాత సందీప్ రెడ్డి కెరీర్ గురించి చాలా ఊహాగానాలే సాగాయి. అందుకు తగ్గ‌ట్టే అగ్ర బ్యాన‌ర్ల‌తో ప‌ని చేసేందుకు సందీప్ రెడ్డి స్క్రిప్టు కూడా రెడీ చేశాడు. కానీ అత‌డి స్క్రిప్ట్ ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. బ్లాక్ బ‌స్ట‌ర్ రిలీజై ఏడాది అవుతున్నా సందీప్ రెడ్డి వంగా తన కొత్త ప్రాజెక్ట్ గురించి ఇప్ప‌టివ‌ర‌కూ ప్రకటించలేదు. అతని తదుపరి సినిమా గురించి ర‌క‌ర‌కాల పుకార్లు వచ్చినా ఏదీ క‌న్ఫామ్ కాలేదు.

ఏడాది కాలంగా కొంతమంది స్టార్ హీరోలను సంప్రదించి చివ‌రికి ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి ఒక చిన్న బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నార‌ని.. ఆయ‌నే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ర‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికి సంబందించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా తెలియాల్సి ఉంటుంది.
Tags:    

Similar News