షాదీ చేసుకున్నా.. సినిమాల కోసం ఇక ప్రయత్నించొద్దన్న స్టార్ హీరోయిన్

Update: 2020-11-23 05:00 GMT
ప్రముఖ హీరోయిన్ సనాఖాన్ వివాహం చేసుకొని ఓ ఇంటి గృహిణి గా మారింది. ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ,  కన్నడ,  హిందీ సినిమాల్లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ముందు మోడల్ గా  రాణించిన సనాఖాన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారి హిందీ తో పాటు కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగు కన్నడ మలయాళం సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి.

 తెలుగులో ఆమె కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కత్తి మూవీతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత గగనం మిస్టర్ నూకయ్య  సినిమాల్లోనూ నటించింది. పలు టీవీ రియాలిటీ షోలతో పాటు అడ్వర్టైజ్ మెంట్స్ ఫీచర్ ఫిల్మ్స్ లో సనాఖాన్ యాక్ట్ చేసింది. సనాఖాన్ హిందీ బిగ్ బాస్ షో 2012 ఫైనలిస్ట్ కూడా.  

కాగా కొద్ది రోజుల కిందట తాను  సినిమాలకు ఇక దూరం అవుతున్నట్టు సనాఖాన్ ప్రకటించింది. తాజాగా ఆమె వివాహం చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈనెల 20వ తేదీన గుజరాత్ కు చెందిన ముఫ్తి అనాస్‌ను పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్తతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు   విడుదల చేయగా అవి  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

' చాలా సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నా. ఎన్నో సినిమాలతో పేరు తెచ్చుకున్నా. ఇక సినీ  జీవితానికి ఫుల్ స్టాప్  పెట్టాలని భావిస్తున్నా. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నా. ఇక ఎవరూ తనను సినిమాల్లో నటించేందుకు సంప్రదించ వద్దు' అని సనాఖాన్ కోరారు. కాగా సనా ఖాన్ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:    

Similar News