• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నేను ఎంత అతి చేసినా...

'నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు'

By - Tupaki Desk
Update: 2021-11-25 05:14 GMT
'హృదయ కాలేయం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌ బాబు.. ఇప్పుడు ''క్యాలీ ఫ్లవర్‌'' అనే స‌రికొత్త చిత్రంతో మనముందుకు వస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్ - రాధాకృష్ణ టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ సినిమాని నిర్మించారు. నవంబరు 26న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హీరో సంపూర్ణేష్‌ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

* ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పెద్దాయన ఆండ్రిఫ్లవర్.. రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అని పేరు పెట్టారు. 'క్యాలీ ఫ్లవర్' అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని నేనూ అడిగాను. క్యారెక్టర్ పాత్ర పేరు కూడా అదే.. ఒకానొక సమయంలో కాపాడే కవచంగా కూడా మారుతుందని డైరెక్టర్ అన్నారు.

* శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ చెప్పాడు. అది చాలా నచ్చింది. కొత్త చెబుతున్నాడని అనిపించింది. అందుకే ఓకే చెప్పాను. ఇందులో కొత్తగా కనిపిస్తాను. కొబ్బరిమట్టలో చెప్పినట్టుగా భారీ లెంగ్తీ డైలాగ్స్ ఉండవు. కోర్ట్ సీన్‌లో మాత్రం అలాంటి డైలాగ్స్ ఉంటాయి.

* 35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని వంశ పారంపర్యంగా వస్తుంది. అందుకే అంత వరకు పవిత్రంగా ఉండాలని.. ఏ అమ్మాయి కూడా దగ్గరగా వచ్చి మాట్లాడకూడదుని.. అంత దూరంలో ఉండాలని ఆ స్కేల్ వాడాం.

* ఈ సినిమాలో గెటప్స్ బాగా సెట్ అయ్యాయి. హీరో రేప్‌ కు గురవ్వడం.. ఆ తరువాత వచ్చే పాటలు ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' సినిమాల మాదిరిగా అందరికీ నచ్చుతుందని అన్నాను.

* డైరెక్టర్ ఆర్కే ఇంతకు ముందు సీరియల్స్ చేశారు. ఈ కథను ఎప్పటి నుంచో అనుకున్నారట. ఈ పాత్ర అలా ఉండాలి.. ఇలా ఉండాలని అనుకున్నారట. సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా నా వద్దకు వచ్చి కథ చెప్పారు.

* హీరోయిన్ వాసంతి ఇది వరకు కన్నడలో సీరియల్స్ చేశారు. తనకు ఇదే మొదటి తెలుగు సినిమా. అయినా కూడా చక్కగా నటించారు. పల్లెటూరిలో చలాకీగా తిరుగుతూ, బావను ఏడిపించే మరదలి పాత్రలో కనిపిస్తారు.

* ఇందులో నేను ఫ్లోర్ మూమెంట్స్ వంటివి ఏం చేయలేదు. ఇందులో కొత్తగా ట్రై చేశాను. నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తుంటారు. 'హ‌ృదయ కాలేయం' లో చితిలోంచి లేచి రావడం.. 'కొబ్బరిమట్ట' లో కొడితే సుమో చేతిలోకి వస్తుంది. అది పరాకాష్ట. 'సింగం 123' సినిమాలో ఇంట్లో స్మిమ్మింగ్ పూల్‌ లో దూకితే ఎక్కడెక్కడో తేలుతాను.

* ఈ రోజు సంతోషంగా ఉన్నామా? రేపు మంచిగా ఉంటాామనే నమ్మకం ఉందా? అనే ఆలోచిస్తాను. నటుడిగా ఏం చేయడానికైనా రెడీ. ఏ పాత్రలు వస్తే అవి చేస్తాను.

* హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నాను. అందుకే గెస్ట్ అప్పియరెన్స్ ఎక్కువగా చేయలేకపోతోన్నాను. ఒక సినిమాలో ఓ కారెక్టర్ వేశాను. 'గోల్డ్ మ్యాన్' అనే సినిమా చేద్దామని అనుకున్నాను. కానీ కరోనా వల్ల వెనక్కి వెళ్లిపోయింది.

* నరసింహాచారి నుంచి సంపూగా ఎదగడం.. ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌ లో తిరిగే స్థాయి వరకు వచ్చాను. అదే నాకు సంతోషం. ప్రస్తుతం నా చేతి నిండా సినిమాలు ఉండటం అదృష్టం. ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడం నాకు ఆనందంగా ఉంటుంది. తెలియని సంతృప్తినిస్తుంది.

* తమిళంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. స్టోరీ బేస్డ్ సినిమా. సీరియస్‌ గా సాగుతుంది. సాయి రాజేష్ గారు ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత మేం మళ్లీ ఓ సినిమా చేస్తాం.
Tags:    
  • sampoornesh babu 
  • Cauliflower 
  • Burning Star 
  • sampoornesh babu new movie 
  • sampoornesh babucomedy 
  • sampoornesh babu Cauliflower 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS