• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా గాడ్‌ ఫాదర్.. రెండు...

మెగా గాడ్‌ ఫాదర్.. రెండు పుకార్లకు ఒకే క్లారిటీ

By - Tupaki Desk
Update: 2021-11-11 13:30 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు చిరంజీవి వరుసగా మూడు సినిమాలను చేస్తున్నాడు. అందులో మొదటగా మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ రీమేక్ లో నటిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మెగా లూసీఫర్ కు గాడ్ ఫాదర్ అనే పవర్ ఫుల్‌ టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీలక పాత్రకు గాను బాలీవుడ్ స్టార్ హీరో కండల రాయుడు సల్మాన్ ఖాన్‌ ను ఎంపిక చేయడం జరిగింది అంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మెగా ఫ్యామిలీతో ఉన్న సన్నిహిత సంబంధాలతో సల్మాన్ ఖాన్ గాడ్‌ ఫాదర్ సినిమాలో నటించేందుకు సిద్దం అయ్యాడనే పుకార్లు జోరుగా వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి స్పందన కోసం అభిమానులు ఎదురు చూశారు.

గాడ్ ఫాదర్ సినిమా లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు తోడుగా మరో పుకారు ఇటీవల పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. అదేంటీ అంటే గాడ్ ఫాదర్‌ సంగీత దర్శకుడు థమన్‌ ఒక పాటను హాలీవుడ్ స్టార్‌ సింగర్ బ్రిట్నీ స్పియర్ తో పాడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇప్పటి వరకు జరగని ఆ అద్బుతం మెగాస్టార్ మూవీలో జరుగబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. కొందరు మాత్రం సల్మాన్ ఖాన్‌ మరియు బ్రిట్నీ స్పియర్‌ రెండు వార్తలు కూడా పుకార్లే అయ్యి ఉంటాయని అనుకుంటున్నారు. కాని ఈ రెండు పుకార్లకు థమన్ ఒకే సమాధానంతో క్లారిటీ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు.

ఇటీవల ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన సంగీత దర్శకుడు థమన్‌.. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవిగారు మరియు సల్మాన్ ఖాన్ గారు కలిసి ఒక పాటకు డాన్స్ చేయబోతున్నారు. ఆ పాట చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో హాలీవుడ్ సింగర్ ను సంప్రదించడం జరిగింది. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆమె ఒప్పుకుంటే తెలుగు వర్షన్ లో పాడించాలా లేదంటే ఇంగ్లీష్‌ వర్షన్ లో పాడించాలా అనే నిర్ణయానికి వస్తాం. త్వరలోనే ఒక క్లారిటీ దక్కుతుందని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. థమన్ వ్యాఖ్యలతో గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్‌ నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజమే అని.. అలాగే బ్రిట్నీ స్పీయర్ తో సంప్రదింపులు కూడా నిజమే అని తేలిపోయింది. ఈ రెండు జరిగితే గాడ్‌ ఫాదర్ రేంజ్ ఊహించుకోవడమే కష్టంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మెగా మూవీ అంటే ఏదైనా సాధ్యమే.. కనుక ఈ రెండు సాధ్యం అవుతాయని ఆశిద్దం అంటూ అభిమానులు పాజిటివ్ గా ఉన్నారు.



Tags:    
  • Megastar Chiranjeevi 
  • Godfather 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS