• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కామెడీ రోల్ చేయాలని ఉంది:...

కామెడీ రోల్ చేయాలని ఉంది: సమంత

By - Tupaki Desk
Update: 2021-09-22 03:58 GMT
ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా సమంత తనకి తానుగా ఎదుగుతూ వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. తనకి తాను మలుచుకున్న శిల్పంలా కనిపించే సమంతకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వివాహమైనప్పటికీ ఆమె క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. ఆమెతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే కొంతకాలంగా ఆమె గ్లామర్ పాత్రలను కాకుండా నటన ప్రధానమైన పాత్రలకు గ్రీన్   సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. నాయిక ప్రధానమైన పాత్రలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతోంది.

' ఓ బేబీ' .. 'యు టర్న్' .. 'జాను' సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇక 'శాకుంతలం' కూడా అదే జాబితాలో చేరనుంది. సమంత కెరియర్లోనే ఇది ఒక ప్రత్యేక చిత్రంగా మిగలనుంది. ఈ తరహా జోనర్లో .. ఇంతటి భారీ బడ్జెట్లో ఆమె చేసిన తొలి సినిమా ఇదే అవుతుంది. సమంత అభినయంపై ఎంతటి నమ్మకం ఉంటే గుణశేఖర్ ఆమెకి ఆ పాత్రను ఇచ్చి ఉంటాడనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తరువాత సమంత ఏ తెలుగు సినిమాకి ఇంతవరకూ ఓకే చెప్పలేదు. ఆమెకి కథలు వినిపించడానికి మాత్రం చాలామంది రెడీగా ఉన్నారు.

ఇక చైతూ .. సమంత మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం కొన్ని రోజులుగా జోరుగా జరుగుతోంది. అందువల్లనే ఆమె ఎక్కువగా చెన్నైలో ఉంటోందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ రూమర్లను పెద్దగా పట్టించుకోకుండా సమంత తనపని తాను చేసుకుపోతోంది. బయట జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందో లేదో అనే విషయాన్ని ఎవరూ తేల్చుకోకుండా తెలివిగా అయోమయంలో పడేస్తోంది. త్రిష .. కీర్తి సురేశ్ వంటి తన ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ, తాను చాలా హ్యాపీగా ఉన్నాననే సంకేతాలు ఇస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తోంది.

తాజాగా మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ, పూర్తిస్థాయి కామెడీ పాత్రలో చేయాలనుందని చెప్పింది. కామెడీ చేయడం అన్నిటికంటే చాలా కష్టమనీ .. అలాంటి కామెడీ పాత్రలో నటించి మెప్పించాలనే ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 'ఓ బేబీ' సినిమాలో సమంత కొన్ని కామెడీ సీన్స్ ను అద్భుతంగా పండించింది. ఆ సినిమా విజయంలో  ఆమెదే కీలకపాత్ర అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు కూడా. ఇక ఈ సారి పూర్తి స్థాయి కామెడీ సినిమాలో .. కామెడీ పాత్ర చేయాలనుకుంటుందన్న మాట. ఇక 'లవ్ స్టోరీ' సినిమా రిలీజ్ అయిన తరువాత సమంత ఎలా స్పందించనుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.        
Tags:    
  • samantha 
  • samantha movies 
  • samanthafav movies 
  • samantha roles 
  • The Family man2 
  • Samantha ruth prabhu 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS