సమంత చెప్పిన పుట్టింటి సంగతులు

Update: 2017-10-20 05:15 GMT
అక్కినేని నాగచైతన్య - సమంతల పెళ్లి జరిగినపుడు సమంత కుటుంబ సభ్యులు పెద్దగా కనిపించింది లేదు. ఒక దశలో సమంత కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి వచ్చారా లేదా అన్న సందేహం కూడా కలిగింది. ఐతే సమంత తల్లిదండ్రులతో కలిసి నవ దంపతులు దిగిన ఫొటో కొన్ని రోజుల తర్వాత బయటికి రావడంతో ఆ సందేహాలకు తెరపడింది. అసలు సమంత పెళ్లి కంటే ముందు ఆమె తల్లిదండ్రులు మీడియాలో కనిపించిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఎంగేజ్మెంట్ సమయంలోనూ ఇద్దరూ కనిపించలేదు. దీన్ని బట్టే వాళ్లెంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అసలు సమంత తన ఫ్యామిలీ గురించి మాట్లాడటం కూడా చాలా తక్కువ.

ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత తన తల్లిదండ్రుల గురించి స్పందించింది. వాళ్లింట్లో చైతూ మీద ముందు నుంచి ఉన్న అభిప్రాయం గురించి మాట్లాడింది. ‘‘మా అమ్మానాన్న చాలా సింపుల్ గా ఉంటారు. అసలు వాళ్లు సినిమాలే చూడరు. నా సినిమాలు కూడా చూడరు. నేను పెద్ద స్టార్ అన్న విషయం కూడా వాళ్లకు తెలియదంటే నమ్మండి. మా ఇంట్లో నా సినిమా జీవితానికి సంబంధించిన విశేషాలేమీ మాట్లాడుకోం. అసలు నేను సినిమాల్లో అందుకున్న అవార్డులేవీ కూడా ఇంట్లో కనిపించవు. మా ఇంట్లో నా కెరీర్ కు సంబంధించి ఒకే ఒక గుర్తు.. ‘ఏమాయ చేసావె’లో నేను.. చైతన్య కలిసున్న ఫొటో. నాకు చైతూ బెస్ట్ ఫ్రెండ్ అని మా అమ్మానాన్నలకు తెలుసు. అందుకే వాళ్లు పెళ్లి విషయంలో చాలా హ్యాపీ. ఇక నేను అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్తున్న నేపథ్యంలో మా అమ్మ ఒకే ఒక మాట  అంది.. ‘‘ఇక చాలు.. నీ అల్లరి ఆపేసేయ్’’ అని సమంత చెప్పింది.
Tags:    

Similar News