‘సామ్​జామ్​’ కి సమంత రెమ్యునరేషన్​ ఎంతో తెలిస్తే షాకే ..!

Update: 2020-11-15 08:30 GMT
ఆహా యాప్​ కోసం సమంత ‘సామ్​ జామ్​’ అనే టాక్​ షో చేస్తున్న ఈ విషయం తెలిసిందే. ఈ షో 10 ఎపిసోడ్లకు గాను సమంత రూ.1.5 కోట్లు రెమ్యునరేషన్​ తీసుకున్నట్టు టాక్​. నిజాని సమంత మార్కెట్​ను బట్టి చూస్తే ఈ అమౌంట్​ చాలా తక్కువ. అయితే ఆహా యాప్​ యాజమాన్యంతో ఉన్న సత్సంబంధాల వల్లే సమంత ఈ టాక్​ షో చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు  లాక్​డౌన్ టైంలో ఆహా యాప్​ ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. ఈ యాప్​ ద్వారా విడుదలైన సినిమాలు, వెబ్​సీరిస్​లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అచ్చ తెలుగు యాప్​గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నది ‘ఆహా’.

అయితే ఆహాలో సమంత ఓ టాక్​ షో చేయనుందని తెలియడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా హైప్​ క్రియేట్​ చేశాయి. కానీ ఈ షో చూశాక ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్టు టాక్​. ‘సామ్ జామ్‌’లో షోలో మొదటి గెస్ట్​ విజయ్ దేవరకొండ.. ఇంకా పది ఎపిసోడ్ లు రానున్నాయి. ఈ షో నవంబర్ 13న టాక్​షో  ప్రారంభమైంది. బాలీవుడ్‌లో కాఫీ విత్ కరణ్ షో తరహాలో ఉంటుందని అంతా ఆశించారు. కానీ మొదటి షో చూసిన ప్రేక్షకులతో కొంత డిస్సప్పాయింట్​ అయ్యారు.


కాగా  సమంత హైదరాబాద్​లో కొన్ని  బిజినెస్​లు కూడా చేస్తున్నది. తన స్నేహితురాళ్లతో కలిసి జూబ్లిహిల్స్‌లో ఓ ప్రీ స్కూల్‌ను స్టార్ట్ చేసింది. ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో   'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమాని ప్లాన్‌ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News