పాకిస్తాన్ ఫ్యాషన్ లేబుల్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా.. విమర్శల వర్షం!
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నెగిటివ్ వేలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.;
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నెగిటివ్ వేలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో అలియా భట్ పై విమర్శలు వెళ్లువెత్తడానికి వెనుక పెద్ద కథే ఉంది. పాకిస్తాన్ ఫ్యాషన్ లేబుల్ బ్రాండ్ కి అంబాసిడర్ గా అలియా భట్ నియమితురాలు అయ్యింది అంటూ వార్త కథనం ప్రకారం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక దీంతో నిజంగానే పాకిస్తానీ బ్రాండ్ కి అలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పాకిస్తానీ బ్రాండ్ కు అంబాసిడర్ గా అలియా భట్..
అసలు విషయంలోకి వెళ్తే.. పాకిస్తాన్ కు చెందిన "వజేషా అఫీషియల్" అనే ఒక క్లాతింగ్ బ్రాండ్ ఈవారం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. అలియా భట్ లేటెస్ట్ ఎత్నిక్ వేర్ కలెక్షన్ ధరించి ఫోజులిచ్చినట్లుగా కొన్ని ఫోటోలను ఈ బ్రాండ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. దీంతో పాకిస్తాన్ బ్రాండ్ ను అలియా భట్ ప్రమోట్ చేయడం ఏంటి? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెళ్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్రాండ్ తన ఇంస్టాగ్రామ్ లో అలియా భట్ వివిధ రకాల రంగులలో సిల్క్ దుస్తుల్లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా లావెండర్ , బ్లాక్ , బర్గుండి, ఎమరాల్డ్ టీల్ వంటి డ్రెస్సుల్లో మెరిసిపోతున్నట్లు ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు "మా ప్యూర్ శీషా సిల్క్ కలెక్షన్ అంటే అలియా భట్ కు కూడా ఇష్టం.. అందుకే మీరు మీకు నచ్చిన రంగుల్లో దుస్తులను ఆర్డర్ చేయండి" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఎప్పుడైతే ఈ క్యాప్షన్ చూశారో.. చూసిన నెటిజన్స్ కూడా నిజంగానే ఆలియా ఈ బ్రాండ్ కి ప్రచారకర్తగా మారిందా అని చాలామంది ఆశ్చర్యపోయారు.
అసలు నిజం ఏంటి?
అయితే అసలు నిజం ఏంటి అనే విషయానికి వస్తే.. అలియా భట్ ఏ పాకిస్తానీ బ్రాండ్ కి ప్రచారం చేయడం లేదు. ఇవన్నీ కేవలం ఫేక్ ఫోటోలు మాత్రమే . ఏఐ లేదా హై ఎండ్ ఫోటోషాప్ టూల్స్ ఉపయోగించి ఈ ఫోటోలను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అలియా భట్ గతంలో వివిధ ఫ్యాషన్ షోలు , ఫోటోషూట్లలో పాల్గొన్న ఫోటోలను ఆమె అనుమతి లేకుండా తీసుకొని ఆమె ముఖాన్ని శరీరాన్ని ఈ బ్రాండ్ దుస్తుల పైకి డిజిటల్ గా మార్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే అలియా ప్రమేయం లేకుండానే ఆ బ్రాండ్ దొంగతనంగా ఆమె ఫోటోలను ఉపయోగించి సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. అసలు నిజం తెలియని వాళ్ళు అలియా పై విమర్శలు గుప్పించారు.ఇప్పుడు అసలు విషయం తెలిసి ఆ పాకిస్తానీ బ్రాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.