ట్రెండీ టాక్: ఓంరౌత్ - ప్ర‌భాస్ ఎందుకు ఆ త‌ప్పు చేసారు?

2026-27 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంఛైజీ సినిమాగా `రామాయ‌ణం` సంచ‌ల‌నం సృష్టించ‌బోతోంది. ఈ ఏడాది దీపావ‌ళి (అక్టోబ‌ర్), వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ రెడీ అవుతోంది.;

Update: 2026-04-22 02:30 GMT

2026-27 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంఛైజీ సినిమాగా `రామాయ‌ణం` సంచ‌ల‌నం సృష్టించ‌బోతోంది. ఈ ఏడాది దీపావ‌ళి (అక్టోబ‌ర్), వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ రెడీ అవుతోంది. భార‌తీయ పురాణేతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగిన రామాయ‌ణంపై వ‌రుస‌గా రెండు సినిమాలు తీస్తున్నారు న‌మిత్ మ‌ల్హోత్రా. రామాయ‌ణ క‌థ‌తో ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ సాహ‌సాలు చేస్తున్నారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రెండు వైపులా ప‌దునున్న క‌త్తితో గేమ్స్ ఆడుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల విడుద‌లైన‌ రామాయ‌ణం పార్ట్ 1 టీజ‌ర్ పై ఒక సెక్ష‌న్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఓంరౌత్ త‌ర‌హాలోనే క‌థ‌లో పాత్ర‌ల తీరుతెన్నుల‌ను మార్చేస్తున్నార‌ని టీజ‌ర్ రిలీజ‌వ్వ‌గానే విమ‌ర్శ‌ల ఝ‌డివాన కురిసింది. సోష‌ల్ మీడియాల్లో సాంప్ర‌దాయవాదుల రివ్యూల్లో క‌నిక‌రం అన్న‌దే క‌నిపించ‌లేదు. శ్రీ‌రాముడి పాత్ర‌ధారి అయిన ర‌ణ‌బీర్ క‌పూర్ ఆహార్యంపై కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తే, మ‌రికొంద‌రు విమ‌ర్శించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌డి ముఖంలో శ్రీ‌రాముడిగా ఆశించిన‌న్ని ఎక్స్ ప్రెష‌న్స్ ప‌ల‌క‌లేద‌ని కొంద‌రు స‌మీక్ష‌కులు విమ‌ర్శించారు. అంతేకాదు టీజ‌ర్ ఆరంభంలో ఒక వింత జీవిని కూడా చూపించారు. రాక్ష‌సుల‌తో పోరులో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పోలిక‌లు చూసారు.

అయితే ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో ఈ విమ‌ర్శ‌ల‌పై నిర్మాత‌ న‌మిత్ స్పందించారు. న‌మిత్ మ‌ల్హోత్రా ప్ర‌కారం.. హాలీవుడ్ లేదా పాశ్చాత్య ఆడియెన్ కి క‌నెక్ట‌య్యేలా `రామాయ‌ణం`లో అసురుల (రాక్ష‌సుల‌) గెట‌ప్ మార్చేసామ‌ని అన్నారు. అందులో మాన్ స్టార్ పాత్ర‌ను అలా డిజైన్ చేయ‌డానికి కార‌ణం హాలీవుడ్ ఆడియెన్ ని రీచ్ అవ్వాల‌నే ఆలోచ‌నే కార‌ణ‌మ‌ని చెప్పారు..

ఈ చిత్రంలో రావణుడిగా నటిస్తున్న కన్నడ స్టార్ యశ్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. ఈ సినిమా లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గ్లాడియేటర్ వంటి భారీ హాలీవుడ్ ఫాంటసీ చిత్రాల తరహాలో ఉంటుందని వెల్లడించారు. పాశ్చాత్య ప్రేక్షకులకు సైతం ఈ కథాంశం సుపరిచితంగా.. సులభంగా అర్థమయ్యేలా చిత్ర శైలిని మలుచుకున్నామని.. తద్వారా మన సంస్కృతిని ప్రపంచమంతా చూడాల్సిన కథగా మారుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక భాషకో ప్రాంతానికో పరిమితం కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న విజువల్ ఎపిక్ అని కూడా తెలిపారు.

అయితే ఓంరౌత్ కూడా అదే కార‌ణం చెప్పి `ఆదిపురుష్`ని హాలీవుడ్ లో రిలీజ్ చేయాల్సింది. తెలుగు- త‌మిళంలో తిట్టారు. హిందీ ఆడియెన్ పెద‌వి విరిచేసారు. కానీ పాశ్చాత్య ఆడియెన్ కి ఆదిపురుష్ బాగా క‌నెక్ట‌య్యేదేమో.. ఎవ‌రికి తెలుసు? ఇక్క‌డ ఉన్నంత సంస్కృతి- సాంప్ర‌దాయవాదం ఫీలింగ్, మ‌నోభావాల స‌మ‌స్య పాశ్చాత్య దేశాల్లో ఉండ‌దు గ‌నుక‌.. ఇక హాలీవుడ్ లేదా పాశ్చాత్య దేశాల్లో విడుద‌ల చేయాల్సిన సినిమాల‌న్నిటిలో మ‌న నేటివిటీ పురాణ క‌థ‌ల్లోని పాత్ర‌ల్లో స్వ‌ల్ప మార్పులు ఉండ‌టం ఖాయ‌మ‌ని భావించ‌వ‌చ్చు.

`ఆదిపురుష్` చిత్రంలో ఆంజ‌నేయుడు పాత్ర‌ధారి మిన‌హా మిగ‌తా అంద‌రినీ చింపాజీలు(ఏప్స్) గా చూపించాడు ఓంరౌత్. రామాయ‌ణంలో చింపాజీలు ఎలా వ‌చ్చాయి? అని ఆడియెన్ పూర్తిగా క‌న్ఫ్యూజ్ అయ్యారు. అది బ్లండ‌ర్ కాదు.. అంత‌కుమించి! అని జ‌నం తీవ్రంగా తిట్టారు. ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా చూసి, అక్క‌డ ఏప్స్ ని రామాయ‌ణంలోకి ఎలా ర‌ప్పించాడో అర్థం గాక జ‌నం జుట్టు పీక్కున్నారు.

అయితే తెలిసి తెలిసీ ఇప్పుడు న‌మిత్ మ‌ల్హోత్రా- నితీష్ తివారీ బృందం కూడా అదే ప‌ని చేస్తున్నార‌నే ఆందోళ‌న దేశ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌రాముడి భ‌క్తుల్లో నెల‌కొంది. రామాయ‌ణం టీజ‌ర్ లో మాన్ స్ట‌ర్‌ల‌ను సృష్టించిన తీరు చూడ‌గానే ఇది స‌త్య‌ దూరంగా ఉంద‌ని చాలా మంది విమ‌ర్శించారు. అయితే ఆ పాత్ర‌ల‌ను అలా ఏఐ-లో సృష్టించి 4000 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి ఎలా జోడించారు? అన్న సందేహాలు చాలా మందిని అలుముకున్నాయి. రామాయ‌ణం, మ‌హాభార‌తం వంటి పురాణేతిహాసాల‌ను ట‌చ్ చేయ‌కూడదు. అది రీల్ కోస‌మే అయినా త‌ప్పులు చేస్తే అస్స‌లు క‌నికరించ‌రు. మ‌నోభావాల‌కు నిప్పంటుకుంటుంది. క‌నీసం సినిమా రిలీజ‌య్యే లోపు ఆ లోపాల్ని స‌రి చేసుకోక‌పోతే స‌మీక్ష‌ల్లో `తూట్లు` పొడ‌వ‌డం ఖాయ‌మ‌ని కూడా విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News