థియేటర్ కిక్కుతో దేన్నీ పోల్చలేం!
అదెంత గొప్ప సీరీస్ అయినా? ఓటీటీ రిలీజ్ అయినా థియేటర్ తర్వాతే ఏదైనా? అన్నారు. అయితే పరిశ్రమలో వస్తోన్న మార్పులను కరిష్మా సానుకూలంగా స్వాగతిస్తున్నారు.;
బాలీవుడ్ వెండితెరపై దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన నటి కరిష్మా కపూర్. 90వ దశకంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన కరిష్మా పెళ్లి తర్వాత ప్రాధాన్యతలను మార్చుకుని సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఆమె మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రాజెక్టులతో బిజీగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కరీష్మా కపూర్ వెండితెరపై తనకున్న ఆసక్తిని మరోసారి వ్యక్తం చేసారు. వెండితెర ఎప్పటికీ నా సొంత ఇల్లు లాంటిదని అభివర్ణించారు. తాము కెమెరాల మధ్యే పెరిగామని, ఆ సెట్స్, లైట్లు, యాక్షన్ అనే మాటలు తన జీవితంలో అంతర్భాగమని పేర్కొన్నారు.
ఎన్ని కొత్త మాధ్యమాలు వచ్చినా, వెండితెర ఇచ్చే తృప్తి మరే ఇతర ప్లాట్‌ఫామ్ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తోన్న అవకాశాల గురించి ప్రస్తావించారు. డిజిటల్ మాధ్యమం నటీనటులకు ఎంతో స్వేచ్ఛను ఇస్తోందన్నారు. అక్కడ వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం ఉంటుందని కానీ ఒక నటిగా ఉనికిని చాటుకోవడానికి వెండితెర ఎప్పుడూ తన మొదటి ప్రాధాన్యతగా ఉంటుందన్నారు. థియేటర్లలో ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూడటంలో ఉండే మ్యాజిక్ ఎప్పటికీ తగ్గదన్నారు. వెబ్ సిరీస్ లు...డాక్యుమెంటరీలు...ఓటీటీ రిలీజ్ లు ఎన్ని చూసినా? థియేటర్ కు వెళ్లి పెద్ద తెరపై సినిమాను ఆస్వాదించడంలో ఆనందం ఇంకెక్కడా ఉండదు.
అదెంత గొప్ప సీరీస్ అయినా? ఓటీటీ రిలీజ్ అయినా థియేటర్ తర్వాతే ఏదైనా? అన్నారు. అయితే పరిశ్రమలో వస్తోన్న మార్పులను కరిష్మా సానుకూలంగా స్వాగతిస్తున్నారు. తన హయాంలో హీరోయిన్ల పాత్రలు కొంత పరిమితంగా ఉండేవని కానీ ఇప్పుడు కథలు మారుతున్నాయన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మహిళా ప్రధాన చిత్రాలు రావడం, నటీమణులకు బలమైన పాత్రలు లభించడం గొప్ప పరిణామమని కొనియాడారు.ఈ మార్పు వల్లే తాను కూడా మళ్ళీ కెమెరా ముందుకు రావడానికి ఉత్సాహం చూపిస్తున్నానని వెల్లడించారు.
వ్యక్తిగత జీవితం - వృత్తిని సమతుల్యం చేసుకోవడంలో కరిష్మా ఎప్పుడూ క్లారిటీతోనే ఉన్నారు. పిల్లల బాధ్యతలను నెరవేరుస్తూనే నటనపై ఉన్న ఆసక్తి తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. `వెండితెర ఎప్పటికీ నా ఇల్లే. వృత్తి పట్ల ప్రేమే కాకుండా కుటుంబానికి ఉన్న సుదీర్ఘ సినీ చరిత్ర , వారసత్వం కూడా ప్రతిబిం బిస్తోంది. అందుకే కరీష్మా కపూర్ ను అభిమానులు ఇప్పటికీ అదే ఆదరణతో చూస్తున్నారు. కరిష్మా కపూర్ వంటి నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఉనికిని చాటుకోవడం భవిష్యత్ తరానికి స్ఫూర్తి. కాలం మారినా? నటనలో ఆమె చూపే హుందాతనం, వెండితెరపై ఆమెకున్న పట్టు ఏమాత్రం తగ్గలేదని మాటలే నిరూపిస్తున్నాయి. భవిష్యత్తులో ఆమె మరిన్ని మంచి పాత్రలతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.