హీరోయిన్ల మెయింటెనెన్స్‌కి లక్షల్లో ఎందుకు ఖర్చవుతుంది?
నిధి అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ఇటీవల పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భారీ పీరియడ్ డ్రామా `హరి హర వీరమల్లు`లో నటించింది.;
వెండితెరపై మెరిసిపోయే కథానాయికల గ్లామర్ వెనుక ఎంతో కష్టం.. అంతకు మించిన ఖర్చు దాగి ఉంటుంది. ఒక హీరోయిన్ పర్ఫెక్ట్ లుక్‌తో కనిపించాలంటే జిమ్, యోగా, ఏరోబిక్స్ వంటి ఫిట్‌నెస్ సాధనాలతో పాటు మేకప్, హెయిర్ స్టైలింగ్ కోసం నిత్యం శ్రమించాల్సి ఉంటుంది. కేవలం అందం మాత్రమే కాకుండా మానిక్యూర్, పెడిక్యూర్, వాక్సింగ్ వంటి సౌందర్య చికిత్సల కోసం భారీగా వెచ్చించాలి. ఇవన్నీ ఒక హీరోయిన్‌ను వెండితెరపై `గ్లామ్ డాళ్`గా నిలబెట్టడానికి చేసే నిరంతర ప్రయత్నాలు.
అయితే ఈ మెయింటెనెన్స్ అనేది కేవలం సౌందర్య సాధనాలకే పరిమితం కాదు. లగ్జరీ కార్లు, ఆఫీస్ నిర్వహణ, నిరంతర విమాన ప్రయాణాలు వంటివి వృత్తిలో భాగంగా మారిపోయాయి. వీటికి తోడు నాణ్యమైన ఆహారం (డైట్) కోసం చేసే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. వీటన్నింటినీ పర్యవేక్షించడానికి పర్సనల్ స్టాఫ్‌ను కూడా నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఒక సాధారణ హీరోయిన్ తన ఉనికిని కాపాడుకోవడానికి నెలకు కనీసం 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా.
ఇదే విషయంపై నటి నిధి అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల ఖర్చుల గురించి ఆమె మాట్లాడుతూ.. బయటకు కనిపించే లగ్జరీ వెనుక భారీ పెట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణాలు, బస, స్టాఫ్ జీతాలు, మేకప్ ఇలా ప్రతిదీ లక్షలతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. ఈ ఖర్చులన్నీ భరిస్తూనే కెరీర్‌లో రాణించడం అనేది ఒక సవాల్‌తో కూడుకున్న విషయమని నిధి తన అభిప్రాయాన్ని తెలిపింది.
నిధి అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ఇటీవల పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భారీ పీరియడ్ డ్రామా `హరి హర వీరమల్లు`లో నటించింది. ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో పాటు ప్రభాస్ `రాజా సాబ్` ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నిధి అగర్వాల్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న ఈ బ్యూటీ మున్ముందు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
అయితే నిధి అగర్వాల్, రాశీ ఖన్నా లాంటి వారికి ఈ ఖర్చు. నయనతార, దీపిక పదుకొనే, కత్రిన లాంటి టాప్ రేంజ్ హీరోయిన్లకు అంతకుమించి ఖర్చు ఉంటుంది. వీళ్లకు ప్రత్యేకించి ప్రయివేట్ జెట్ లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటి కోసమే కోట్లలో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.