చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదా?

అయితే ఆ బ్యూటీ మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా తోసిపుచ్చడమే కాకుండా తన షరతులతో మేకర్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. తనకు ఆఫర్లు తగ్గినా సరే?

Update: 2026-09-23 13:30 GMT

చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత పరిశ్రమలోని కొందరు నటీనటుల తీరును చూస్తే గుర్తుకొస్తుంది. సినిమా రంగంలో అవకాశాలు తగ్గినా? క్రేజ్ మసకబారినా? కొందరు హీరోయిన్లు మాత్రం అహంభావం , అంచ నాలను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉండరు. తాజాగా ఓ ప్రముఖ హీరోయిన్ వ్యవహరిస్తున్న తీరు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు వరుస స్టార్ సినిమాలతో, అగ్ర హీరోలతో జోడీ కట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న భామకు ప్రస్తుతం సరైన హిట్లు లేక అవకాశాలు రావ‌డం లేదు.

చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేకపోవడంతో ఆఫర్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో ఇతర యంగ్ కథానాయికలు రేసులోకి రావడం వల్ల అమ్మ‌డికి కొత్త అవకాశాలు రావడం కష్టంగా మారింది. ఇలాంటి క్లిష్ట సమయంలో సదరు హీరోయిన్ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు కొందరు దర్శకనిర్మాతలు ముందుకు వచ్చారు. ప్రెజెంట్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్, హిట్ ట్రాక్ ఉన్న టైర్ 2 హీరోల సరసన కథానాయికగా నటించాలని ఆమెను సంప్రదించారు. ఆమె ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని గౌరవప్రదమైన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా మేకర్స్ సిద్ధపడ్డారు.

అయితే ఆ బ్యూటీ మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా తోసిపుచ్చడమే కాకుండా తన షరతులతో మేకర్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. తనకు ఆఫర్లు తగ్గినా సరే? తాను కేవలం టైర్ 1 అగ్ర హీరోలతో మాత్రమే నటిస్తానని తేల్చి చెబుతోందట. చిన్న లేదా మీడియం రేంజ్ హీరోల పక్కన నటిస్తే తన రేంజ్ , ఇమేజ్ పడిపోతుందనే అపోహలో భామ ఉందనే ప్రచారం ఫిలింనగర్‌లో విస్తృతంగా సాగుతోంది.

ఇండస్ట్రీలో సమయానుకూలంగా మారడం, మార్కెట్ పరిస్థితిని బట్టి ప్రాజెక్టులను ఎంచుకోవడం ముఖ్యం. చేతిలో సినిమాలు లేని సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఈగోకు పోతే ఉన్న ఆఫర్లు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టైర్ 2 హీరోలతో విజయాలు సాధించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కథానాయికలు ఎందరో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. మార్కెట్ తగ్గినా ఆటిట్యూడ్ తగ్గని భామ ప్రవర్తనపై నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ హీరోయిన్ వాస్తవాన్ని గ్రహించి ప‌ట్టు విడ‌వ‌క‌పోతే? పరిశ్రమలో పూర్తిగా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ బ్యూటీ తన నిర్ణయాన్ని మార్చుకుని రీ-ఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News