హిందీ వాళ్లు సమంతను వదలరా?
ఏదైనా బజ్ క్రియేటవ్వాలంటే క్రేజు ఉండాలి. హిట్టును నమ్మే పరిశ్రమలో బజ్ క్రియేటయ్యేది ఆ ఒక్క బంపర్ హిట్టు దక్కితేనే. లేదంటే ఎవరూ పట్టించుకోరు. యూటర్న్ లాంటి ఫ్లాప్ లో నటించినప్పటికి సమంతను ఎవరూ పట్టించుకోనే లేదు. అంతకుముందు అంతంత మాత్రమే క్రేజు. ఆ తరవాత మజిలీ- ఓ బేబి అంటూ వరుసగా బంపర్ హిట్లు కొట్టగానే ఆహా ఓహో అన్నారు. సమంత ఆ తర్వాత క్షణం తీరిక లేనన్ని ప్రాజెక్టులు తన వెంట పడినా ఏవో కొన్ని మాత్రమే ఓకే చెప్పారు.
అది సరే కానీ.. అక్కినేని కోడలు ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో నటిస్తోంది అన్న వార్తల నడుమ తన పేరు హిందీ పరిశ్రమలోనూ మార్మోగుతోంది. ఈ సిరీస్ లో సామ్ రోల్ సర్ ప్రైజ్ చేస్తుందని రాజ్ అండ్ డీకే అద్భుతంగా ఆ పాత్రను మలిచారని టాక్ వినిపించింది. అక్టోబర్ నాటికి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈలోగానే సామ్ పై హిందీ పరిశ్రమ దృష్టి పడినట్టే కనిపిస్తోంది.
అదంతా సరే కానీ.. సామ్ నటించిన సినిమా ఒకటి హిందీలోకి అనువాదమవుతోందట. సౌత్ వాళ్లే కాదు.. హిందీ వాళ్లు కూడా సమంత క్రేజ్ ని కాష్ చేసుకుంటున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. సమంత నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `సూపర్ డీలక్స్` ని హిందీ లోకి డబ్బింగ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కనిపించిన ఈ మూవీలో సామ్ నటనకు మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ డీలక్స్ సక్సెస్ కలుపుకుని ఒకే ఏడాదిలో సామ్ మూడు హిట్లు కొట్టేయడంతో అది సౌత్ అంతటా హాట్ టాపిక్ అయ్యింది అప్పట్లో. అది ఇప్పుడిలా వర్కవుటవుతోందన్నమాట.