ఇంకా ఎన్ని లెక్కపెట్టాలో సమంత
టాలీవుడ్ లో హైయెస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా సమంతకు ఓ రేంజ్ ఉంది. గోల్డెన్ లెగ్ గా మంచి పేరు కూడా ఉంది. తమిళనాట కూడా ఇలాంటి ఖ్యాతి దక్కించుకోవాలన్నది శామ్స్ ఐడియా. కోలీవుడ్ లో జెండా పాతడానికి గట్టిగానే ఫిక్సయ్యింది సమంత. అందుకే గత ఏడాదిగా తెలుగు సినిమాలను పెద్దగా ఒప్పుకోలేదు కూడా. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు కూడా రిజెక్ట్ చేసే అవకాశం లేనివి కావడంతోనే అంటారు టాలీవుడ్ జనాలు.
ఇంతగా తెలుగు సినిమాలను పక్కనపెట్టి తమిళనాట పాగా వేద్దామని శామ్స్ చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ అవడం లేదు. రీసెంట్ గా దసరాకి రిలీజైన 10, ఎన్రాదుకుళ్ల కోసం బాగానే కష్టపడింది సమంత. చియాన్ విక్రంతో కలిసి ఫైట్లు, ఛేజింగులు గట్రా చేసేసింది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా బాగానే దంచేసింది. ఇన్ని చేసినా.. ఈ మూవీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 10 ఎన్రాదుకుళ్ల అంటే... పది లెక్కపెట్టేలోపు అని అర్ధం. టైటిల్ కి తగ్గట్టుగానే.. పది కూడా లెక్కెట్టకుండానే పారిపోతున్నారు ప్రేక్షకులు. నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని ఇఫ్పటికే తేలిపోయింది. కోలీవుడ్ తన కెరీర్ ఇలా ఉండడంపై బాగా డిజప్పాయింట్ అవుతోంది సమంత.
కత్తి అనే హిట్ ఖాతాలో ఉన్నా.. అందులో సమంత చేసేదేమీ ఉండదు. దీంతో ఇప్పుడు దీపావళికి రానున్న సూర్య మూవీ 24 - ధనుష్ చేస్తున్న తంగమగన్ పైనే సమంత ఆశలన్నీ ఉన్నాయి. తెలుగులో కూడా చేతిలో ఉన్నవి రెండు మూవీస్ మాత్రమే. ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ కి వచ్చిన ఢోకా ఏం లేకపోయినా.. తమిళనాట మాత్రం సమంతకి అర్జంటుగా ఓ భారీ హిట్ అవసరం. లేకపోతే హీరోయిన్ రేసులో వెనుకబడ్డట్లే.