పిల్లల కోసం ప్రపంచంతోనైనా పోరాడుతా!

తానేం మాట్లాడిన అవ‌న్నీ మ‌న‌సులో నుంచి వ‌చ్చే భావాలు త‌ప్ప పెద‌వుల‌పై ఉండే మాట‌లు కాద‌న్ని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది.

Update: 2026-09-25 08:30 GMT

నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న వృత్తిగ‌త జీవితంలో దేదీప్య‌మానంగా సాగిపోతుంది. అమ్మ‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవ్వ‌డంతో తిరుగులేని జ‌ర్నీని ఆస్వాదిస్తోంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ లో అమ్మ‌డి జ‌ర్నీ ఎంతో సంతోషంగా సాగిపోతుంది. న‌టిగా ఎంత‌టి గుర్తింపు సాధించిందో? చ‌మ‌త్కార‌మైన వ్యాఖ్య‌ల‌తోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డం అమ్మ‌డిలో అన్నింటిని మించిన ప్ర‌త్యేక‌త‌. తానేం మాట్లాడిన అవ‌న్నీ మ‌న‌సులో నుంచి వ‌చ్చే భావాలు త‌ప్ప పెద‌వుల‌పై ఉండే మాట‌లు కాద‌న్ని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది.

తాజాగా అమ్మ‌డు తన వ్యక్తిగత ఆలోచనలను, భవిష్యత్ జీవితం , కుటుంబంపట్ల ఉన్న బాధ్యతలను ఎంతో స్పష్టంగా బయటపెట్టారు. మాతృత్వం , కుటుంబ రక్షణ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మాతృత్వం , పిల్లల పెంపకం గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలు తల్లి ప్రేమానురాగాలను, రక్షణ తత్వాన్ని ఆవిష్కరించాయి. `నా పిల్లల భద్రత, వారి ముఖాల్లో సంతోషం కోసం అవసరమైతే ప్రపంచంతో పోరాడటానికి, యుద్ధానికైనా వెళ్లడానికి సిద్ధం` అని అంటూ భావోద్వేగంగా ప్రకటించారు.

నటిగా సమాజంలో ఎలాంటి ఒత్తిడి ఎదురైనా? తల్లిగా కుటుంబానికి అందించాల్సిన ప్రశాంతత, భద్రత విషయాల్లో ఎలాంటి రాజీ ప‌డ‌న‌న్నారు. ఈ మాటలు సాధారణ ప్రకటనగా కాకుండా ప్రతి తల్లిలోని సహజ సిద్ధమైన రక్షణ శక్తిని ప్రతిబింబించేలా ఉన్నాయ‌ని చెప్పొచ్చు. వృత్తిపరంగా పాన్-ఇండియా రేంజ్‌లో బిజీ షెడ్యూల్ ఉన్నా? మానవ సంబంధాలు, భావోద్వేగ అనుబంధాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని రష్మిక పునరుద్ఘాటించారు.

పిల్లలను కని పెంచడం అనేది సమాజం కోసం చేసే బాధ్యత మాత్రమే కాదని అదొక మహిళ జీవితంలో అత్యంత పవిత్రమైన, ఆత్మసంతృప్తినిచ్చే ప్రయాణమని అభివ‌ర్ణించారు. బాక్సాఫీస్ వద్ద సాధించే వందల కోట్ల వసూళ్లు, దక్కే స్టార్‌డమ్ ఇచ్చే ఆనందం కంటే కుటుంబంతో ప్రశాంతంగా గడిపే క్షణాలు, వారిని ప్రేమగా చూసుకోవడమే నిజమైన విజయమని జీవిత పాఠాన్ని వివరించారు. ఈ వ్యాఖ్య‌ల‌తో ర‌ష్మిక‌కు జీవితంపై ఎంతటి స్పష్టమైన విజన్ ఉందో? కుటుంబ వ్యవస్థను ఎంతగా? గౌరవిస్తుందో మాటల ద్వారా అద్దం ప‌డుతోంది.

పాన్ ఇండియాలో ఓ పెద్ద తారైనా? మూలాలను, సాంప్రదాయ కుటుంబ విలువలను మరువకపోవడం రష్మికలో గొప్ప గుణంగా చెప్పొచ్చు. సినీ ప్రయాణంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న సమయంలోనే, భవిష్యత్ కుటుంబ జీవితంపై రష్మిక పరిణతి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జీవితంలో ప్రాధాన్యతలు తెలు సుకుని కెరీర్‌ను, వ్యక్తిగత భావోద్వేగాలను సమతుల్యం చేసుకుంటూ సాగడం ర‌ష్మిక ముందస్తు ప్రణాళికకు నిదర్శనం.

Tags:    

Similar News