హిట్టివ్వమని మెసేజ్ పంపిన సామ్

Update: 2019-03-21 06:10 GMT
ఇంకో రెండు వారాల్లో రాబోతున్న మజిలి కోసం అక్కినేని అభిమనులతో పాటు సినిమా ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు నెలలుగా చెప్పుకోదగ్గ హిట్ ఏది లేక బాక్స్ ఆఫీస్ చాలా నీరసంగా ఉంది. ఏప్రిల్ లో సందడి తీసుకొచ్చే వాటిలో మొదట మజిలినే ఉంది కాబట్టి బోణీ బాగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా దీనికి రీ రికార్డింగ్ చాలా కీలక దశలో ఉంది.

అయితే సంగీత దర్శకుడు గోపి సుందర్ వేరే కమిట్ మెంట్స్ వల్ల హ్యాండ్ ఇవ్వడంతో ఇది కాస్తా అతి తక్కువ టైం పూర్తి చేయాల్సిన బాద్యతను తమన్ మీద పెట్టారు దర్శక నిర్మాతలు. తన పాటలు లేకపోయినా పరిస్థితిని అర్థం చేసుకున్న తమన్ ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒప్పేసుకుని రంగంలోకి దిగాడు

ఈ సందర్భంగానే సమంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమన్ కు మంచి ఆర్ ఆర్ ఇమ్మని మెసేజ్ చేసిందట. పెళ్ళయ్యాక తాను చైతు నటించిన సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఇమ్మని స్పెషల్ రిక్వెస్ట్ పెట్టిందట. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీస్ కి తమన్ ఈ మధ్య మంచి రీ రికార్డింగ్ ఇస్తున్నాడు. ఎలాగూ గోపి సుందర్ ట్యూన్స్ కు పేరు వచ్చేసింది. ఇప్పుడు తమన్ ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేరిస్తే మ్యూజికల్ గా ఫస్ట్ ప్లస్ పాయింట్ తోడవుతుంది. గతంలో తన సినిమాలు ఎన్నింటికో హిట్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ ని సామ్ అదే పనిగా కోరితే బెటర్ గా ఇవ్వకుండా ఉంటాడా
Tags:    

Similar News