ఫోటో స్టొరీ: గోవాలో ఎంజాయ్ చేస్తున్న సామ్

Update: 2018-08-09 05:28 GMT
ఎప్పుడూ ఫుల్లు బిజీగా ఉండే హీరోయిన్స్ లో సమంత పేరు తప్పనిసరిగా చెప్పుకోవాలి. సినిమాలు - బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ - సమాజ సేవ ఒక్కటని కాదు అన్నీ చేస్తుంది.. దీంతో పాటు అక్కినేని వారి కోడలిగా ఉండే కమిట్మెంట్స్ కూడా.  మరి ఇంతా బిజీగా ఉంటే అప్పుడప్పుడూ బ్రేక్ అవసరమే కదా. అలా ఈమధ్య ఓ చిన్న బ్రేక్ తీసుకుని చైతూ తో గోవా ఫ్లయిట్ ఎక్కింది.

సమంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. దీంతో అక్కడినుండి మొదట ఒక ఫోటో పోస్ట్ చేసింది.  దానికి 'గోవా - ఇట్స్ ఎ మిలియన్ లిటిల్ థింగ్స్' అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. 'జీవితం అంటే ఎన్నో చిన్న చిన్న విషయాలు.. ఆనందాలు' అని అర్థమేమో!  ఎందుకంటే సమంత పెద్ద స్టార్ హీరోయిన్ - లవ్ చేసి తనకు నచ్చిన చైతునే పెళ్ళాడింది - రెప్యుటెడ్ ఫిలిం ఫ్యామిలీ లో కి అడుగుపెట్టింది.  ఇవన్నీ పెద్దవి కదా. సో.. సామ్ కు చిన్న చిన్న విషయాలు.. అంటే భర్తతో టైం స్పెండ్ చేయడం - గోవా బీచుల్లో తిరగడం, అలా లంచ్ కు డిన్నర్ కి వెళ్ళడం.. అన్నీ ఎంజాయ్ చేయాలని నిపిస్తోందేమో. పైగా తన టీ-షర్టు పై కూడా 'స్మాల్ ఆసమ్ థింగ్స్' అనే క్యాప్షన్ ఉంది.

ఈ ఫోటో తర్వాత చైతు అలా స్టైల్ గా ఒక చైర్ లో కూర్చోని ఉన్న ఫోటో కూడా పోస్ట్ చేసింది.  అంటే టాలీవుడ్ క్యూట్ కపుల్ తమ పనులన్నిటికీ ఓ బ్రేక్ ఇచ్చి కూల్ గా హాలిడే లో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట.
Tags:    

Similar News