సమంత సినిమాలు చేయదా అన్న ప్రశ్నకు ఇదే ఆమె సమాధానం

Update: 2020-05-07 06:30 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత సినిమాలకు గుడ్‌ బై చెప్పనుందా అంటూ గత కొన్నాళ్లుగా తమిళ.. తెలుగు మీడియాల్లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. చైతూను వివాహం చేసుకున్న తర్వాత సినిమాల సంఖ్య చాలా తగ్గించిన సమంత మెల్ల మెల్లగా సినిమాలకు గుడ్‌ బై చెప్పడం ఖాయం అంటూ తమిళ ఇండస్ట్రీలో చాలా బలమైన వాదన వినిపించింది. ఆ వాదనకు బలం చేకూర్చేట్లుగా సమంత ఈమద్య కాలంలో కొత్త సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆలసత్వం ప్రదర్శిస్తూ వస్తున్నారు. దాంతో ఆ వార్తలు మరింతగా ముదిరాయి.

సమంత సినిమాలకు స్వస్థి చెప్పనుందా అనే ప్రశ్నలకు ఆమె నోరు తెరవకుండానే సమాధానం ఇచ్చేసింది. తాను నటిగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోయించాలని ఆశపడుతున్నట్లుగా సమంత చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ టైంను పూర్తిగా వృదా చేయకుండా సమంత ఆన్‌ లైన్‌ లో యాక్టింగ్‌ క్లాస్‌ లు వింటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెళ్లడి చేసింది. సమంత ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో కొన్ని సినిమాలు తీసుకుంటే అద్బుతమైన నటిగా పేరు దక్కించుకుంది. అయినా కూడా ఆమె ఇంకా యాక్టింగ్‌ స్కిల్స్‌ నేర్చుకుంటుంది అంటే ఆమెకు నటనపై ఎంత ప్యాషన్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ఒక ఇంటికి కోడలు.. ఒక హీరోకు భార్య అవ్వడం వల్ల స్కిన్‌ షో చేయకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఈమె చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సమంత సినిమాలకు కమిట్‌ కాకున్నా కూడా భవిష్యత్తులో ఆమె నుండి ఉత్తమ సినిమాలు వస్తాయి.. అలాగే సమంత ఉత్తమ నటిగా కూడా కీర్తించబడుతుందని ఆమె అభిమానులు నమ్మకంగా ఉన్నారు. గత ఏడాది మజిలీ.. ఓ బేబీ చిత్రాలతో వచ్చిన సమంత ఈ ఏడాది కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఒక్క సినిమాను కూడా విడుదల చేయక పోవచ్చు అంటున్నారు. అయితే ఒక తమిళ వెబ్‌ సిరీస్‌ తో మాత్రం ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Tags:    

Similar News