ఫోటో స్టోరి: 'అల్లు' ఇంటి 'బంగారం'

తాజాగా అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన ఫోటోలలో అల్లు కుటుంబం అంతా `గోల్డ్ అండ్ ఎల్లో` థీమ్‌లో మెరిసిపోతున్నారు.;

Update: 2026-02-23 16:07 GMT

అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. అల్లు శిరీష్ వివాహ వేడుకల్లో భాగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు హాట్ టాపిగ్గా మారుతున్నాయి. తాజాగా అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన ఫోటోలలో అల్లు కుటుంబం అంతా `గోల్డ్ అండ్ ఎల్లో` థీమ్‌లో మెరిసిపోతున్నారు. ముఖ్యంగా స్నేహారెడ్డి తన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ప‌సుపు దంచే -హ‌ల్దీ వేడుక నుంచి స్పెష‌ల్ స్టిల్ అని కూడా తెలుస్తోంది.



 


టాలీవుడ్ బెస్ట్ ఫ్యాషనిస్టా?

స్నేహారెడ్డిని నిస్సందేహంగా టాలీవుడ్ స్టార్ వైఫ్స్‌లో `బెస్ట్ ఫ్యాషనిస్టా` అని పిలవచ్చు. త‌ను ఎంచుకునే దుస్తులు, మినిమలిస్టిక్ మేకప్ ఎప్పుడూ ట్రెండ్ సెట్టింగ్‌గా ఉంటాయి. అల్లూ ఇంటి కోడ‌లికి ఫ్యాషన్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. క‌ల‌మారి ఈవెంట్స్ అనే ఈవెంట్ ప్లానింగ్ సంస్థను, పిల్లల ఫోటోగ్రఫీకి సంబంధించిన `పికాబూ` అనే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.



 


అల్లు శిరీష్ వివాహ విశేషాలు

అల్లు శిరీష్ వివాహం ఈ ఏడాది మార్చి 6న జరగనుంది. నిజానికి అదే రోజు అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం కూడా. మార్చి 6 అర్ధరాత్రి (తెల్లవారితే మార్చి 7) సుముహూర్తంలో శిరీష్ తన ప్రియురాలు నయనిక రెడ్డి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. మెగా కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇప్పటికే జరిగిన కాక్టెయిల్ పార్టీలో ప‌లువురు తారలు సందడి చేశారు.



 


వధువుతో స్నేహారెడ్డి బంధం:

అల్లు స్నేహారెడ్డికి నయనిక అత్యంత ఆప్తమిత్రురాలు. నిజానికి స్నేహారెడ్డి ద్వారానే ఈ సంబంధం ఖాయమైందని సోషల్ మీడియాలో టాక్. వీరిద్దరూ కలిసి తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు.



 


అల్లూ వారి వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఒక ప్రముఖ ప్యాలెస్‌లో జరగబోతోందని సమాచారం. గతంలో నిహారిక కొణిదెల పెళ్లి ఉదయ్‌పూర్‌లో జరిగినట్లే.. శిరీష్ పెళ్లి కూడా ఒక చారిత్రక కట్టడంలో జరగనుంది. జైపూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగిన తర్వాత హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లేదా నానక్‌రామ్‌గూడ ప్రాంతంలోని ఒక కన్వెన్షన్ సెంటర్‌లో సినీరాజ‌కీయ‌ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన పనులన్నీ `అల్లూ వారింటి బంగారం` స్నేహారెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వెన్యూ డెకరేషన్ నుండి మెనూ వరకు అన్నీ ఆమె టేస్ట్ మేరకే జరుగుతున్నాయని స‌మాచారం.

Tags:    

Similar News