అక్కినేని కోడలు కళ్లతోనే కట్టిపడేస్తోందిగా..!!
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత.. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సెలబ్రిటీలలో ఒకరు. సామ్ ఎంత యాక్టీవ్ అనేది ఆమె సోషల్ మీడియా ఖాతాలలో పెట్టే పోస్టులు చూసే చెప్పేయొచ్చు. తాజాగా అమ్మడు ఓ మోనోక్రోమ్ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో సామ్ అందంగా మెరిసిపోతుందనే చెప్పాలి. ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఆ అందమైన పోజులో సామ్ ఆకర్షనీయమైన కళ్లతోనే కట్టిపడేస్తుంది. హాయ్ కొంతకాలం గడిచింది అన్నట్లుగా కాప్షన్ రాసింది సామ్. ప్రస్తుతం సమంత చేతిలో రెండు మూడు భారీ సినిమాలే ఉన్నాయి. అందులో ఒకటి బైలింగ్వేల్ మూవీ కాతువాకుల రెండు కాదల్ ఒకటి కాగా.. మరోటి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శకుంతలం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా చారిత్రాత్మక కథాంశం నేపథ్యంలో రూపొందనుంది.
ఇదిలా ఉండగా.. సమంత ఈ ఏడాది ఓ హిందీ వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలో కూడా అడుగుపెడుతున్న విషయం విదితమే. ఫేమస్ యాక్టర్ మనోజ్ వాజపేయ్ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' రెండవ సీసన్ లో సమంత కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్ లో సామ్ విలన్ క్యారెక్టర్ చేసిందని సమాచారం. అయితే ఈ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్-2' నిజానికి ఫిబ్రవరి 12న విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వలన దీని విడుదల వేసవికి వాయిదాపడింది. మొత్తానికి సామ్ డిజిటల్ తెరమీద కూడా తన సత్తా చాటడానికి రెడీ అయిపోయింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడికి మిలియన్స్ లో ఫాలోయర్స్ ఉన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కోసం తాజా ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం సామ్ మోనోక్రోమ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.