KGF - సలార్.. ఈ లింక్స్ తో హీటెక్కించే బజ్!

Update: 2023-07-07 12:30 GMT
'సలార్‌'.. ప్రకటించినప్పటి నుంచి ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. అదేంటంటే..  ఈ చిత్రం 'కేజీయఫ్‌'కు కొనసాగింపుగా ఉంటుందా? లేదా? ప్రశాంత్‌ నీల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగమా అనేది అభిమానుల మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న ఇది. ఇప్పటికే వదిలిన టీజర్ వల్ల 'కేజీయఫ్' కు 'సలార్‌'కూ కొన్ని సారూప్యతలు కూడా కనపడుతున్నాయి. డార్క్‌ థీమ్‌లో సాగడం, 'కేజీయఫ్‌2'లోని ఓ పాత్ర మెడలో ఉన్న లాకెట్‌ లాంటిదే ప్రభాస్‌ మెడలోనూ కనిపించడం.. 'కేజీయఫ్‌'లో రాఖీ భాయ్ షిప్‌ మునిగిపోయిన సమయం ఉదయం '5.12' గంటలకే.. 'సలార్‌' టీజర్‌ను రిలీజ్ చేయటం.. ఇది కూడా రెండు భాగాలుగా విడుదల కానుండటం..  ఇవన్నీ సినిమాకు కొనసాగింపేనా? లేదా నీల్‌ సినిమాటిక్‌ యూనివర్సా? అనే దానిపై ప్రస్తుతం పెద్ద చర్చే సాగుతోంది. సోషల్ మీడియాలో సాగే చర్చల ద్వారా 'కేజీయఫ్', 'సలార్' కు లింక్ పెడుతూ కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

'కేజీయఫ్ 2'లో రాఖీభాయ్  నేవీ అధికారులకు ఓ ఫ్యాక్స్ సెండ్ చేస్తారు.  అయితే అందులో ఏమి ఉంటుందో తెలీదు.  మరోవైపు సినిమాలో 2014 వరకు 'కేజీయఫ్' కు ఓ మిలిటరీ బేస్ ఉన్నట్లు 2018లో జరుగుతున్న కథలో చూపిస్తారు. ఇప్పుడు 'సలార్' లోనూ ఓ మిలిటరీ బేస్ ను మెయిన్ గా చూపిస్తున్నారు. కాబట్టి ఈ రెండు చిత్రాలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఫ్యాక్స్ పంపించిన తర్వాత 'కేజీయఫ్' 2లో రాఖీ భాయ్ సముద్రంలో పడిపోయి చనిపోయినట్లుగా(స్పష్టంగా చెప్పలేదు) సినిమాను ముగిస్తారు. ఆ తర్వాత మిలిటరీ బేస్ ను చూపించి.. మరో పుస్తకంపై 'కేజీయఫ్ 3' ఉనట్లు హింట్ ఇచ్చారు.  ఇప్పుడేమో అదే మిలీటరీ బేస్ ను ప్రభాస్ 'సలార్' బ్యాక్ గ్రౌండ్ లో చూపించారు. దీంతో  ఈ రెండు చిత్రాలకు కనెన్ ఉన్నట్లు అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఈ రెండు  చిత్రాలలో కనిపించే మిలిటరీ బేసెస్ లో.. అంటే రెండు వింగ్స్ లోనూ సేమ్ నెంబర్స్ ఉన్న వాహనాలు, కంటైనర్స్ కనిపించడం విశేషం.  అంటే 'కేజీయఫ్', 'సలార్' దాదాపుగా ఒకే సమయంలో నడుస్తున్నట్లు తెలుస్తోందని అంటున్నారు.  లేదంటే 'కేజీయఫ్ 2' ముగిసిన వెంటనే 'సలార్' ప్రారంభం అవుతుందని, అందుకే 'కేజీయఫ్' బ్యాక్ గ్రౌండ్ లాంటి థీమ్ ను చూపిస్తున్నారని అంటున్నారు.

ప్రభాస్ స్టైల్, మేకింగ్, మేకోవర్, సినిమా థీమ్.. ఇలా చాలావరకు అన్నీ 'కేజీయఫ్' ప్రపంచాన్ని తలపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా రెండింటికి సంబంధం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ప్రభాస్ - యశ్ కు సంబంధం ఉన్నట్లు అని చెబుతున్నారు. ఇద్దరికి ముందుగానే పరిచయం ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. ఇక సలార్ లో ప్రభాస్ ఓ సోల్జర్ గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.

ఇక పోతే 'కేజీయఫ్ 2' లో సీనియర్ నటి ఈశ్వరి కొడుకు అధీరాను ఎదురిచంబోయి ప్రాణాలను విడుస్తాడు. అయితే అతడు చనిపోయినట్లు సరిగ్గా చూపించలేదు. కాబట్టి అతడే సలార్ అయి ఉండొచ్చని గతంలో ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఇది నిజం కాదని ప్రశాంత్ నీల్ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ సలార్ టీజర్ తో ప్రశాంత్ నీల్ సినిమాపై బాగా హైప్ పెంచేశారు. రకరకాలు ప్రశ్నలను ఆడియెన్స్ మదిలో ఉంచారు.  చూడాలి మరి ప్రశాంత్..  ఈ సలార్ ను ఎలా డిజైన్ చేశారో.

Similar News