హోమ్ గ్రౌండ్ నుంచి మ‌ద్ద‌తు ద‌క్కేనా?

కానీ సైరా త‌ర్వాత పూర్తిగా టాలీవుడ్ కి దూర‌మ‌య్యాడు. హిందీ సినిమాల‌కు దూర‌మై కూడా ఆరేళ్లు అవుతుంది. త‌మిళ సినిమాల‌కైతే ప‌దేళ్ల‌గా దూరంగా ఉంటున్నాడు.;

Update: 2025-12-30 06:30 GMT

క‌న్న‌డ న‌టుడు సుదీప్ ఆరేళ్ల‌గా మాతృభాష‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. అక్క‌డే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.త‌న సినిమా ప్ర‌చారంతో పాటు ఇత‌ర స్టార్ల చిత్రాల‌కు వీలైనంత బూస్టింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మ‌రి ఇత‌ర భాష‌ల్లో ఈ ఆరేళ్ల కాలంగా ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. మ‌రి అవ‌కాశాలు రాక చేయ‌లేదా? వ‌చ్చినా తానే రిజెక్ట్ చేస్తున్నాడా? అంటే ఇటీవ‌ల ఆయ‌న వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి ఆయ‌నే కావాల‌ని తెలుగు, త‌మిళ, హిందీ సినిమాలు చేయ‌డం లేదా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది. ఇత‌ర భాష‌ల‌కు చెందిన స్లార్లు గానీ, న‌టులు క‌న్న‌డ‌లో ప‌ని చేయ‌డం లేద‌ని ఇటీవ‌లే సుదీప్ అన్నాడు.

దీంతో అత‌డి మాట‌ల్లో ఓ అసంతృప్తి క‌నిపించింది. క‌న్నడ‌ న‌టులంతా ఏ భాష‌లో అవ‌కాశాలు వ‌చ్చినా? చేస్తున్నారు. మ‌రేందుకు? ప‌క్క ప‌రిశ్ర‌మ‌ల న‌టులు క‌న్న‌డ‌కు రావ‌డం లేద‌న్న విష‌యంలో సుదీప్ సంతృప్తిగా లేడ‌నిపిస్తుంది. ఈ కార‌ణంగా సుదీప్ తెలుగులో వ‌చ్చిన అవ‌కాశాలు వ‌ద్ద‌నుకుంటున్నాడా? అన్న అంశం హైలైట్ అవుతుంది. తెలుగు సినిమాలు అత‌డికి కొత్తేం కాదు. `ఈగ‌`లో న‌టించాడు. ఆ సినిమాతో ఎంతో పాపుల‌ర్ అయ్యా డు.అటుపై `ర‌క్త చ‌రిత్ర‌`, `యాక్ష‌న్ 3 డీ`, `బాహుబ‌లి`, `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించి తెలుగు ఆడియ‌న్స్ కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.

కానీ సైరా త‌ర్వాత పూర్తిగా టాలీవుడ్ కి దూర‌మ‌య్యాడు. హిందీ సినిమాల‌కు దూర‌మై కూడా ఆరేళ్లు అవుతుంది. త‌మిళ సినిమాల‌కైతే ప‌దేళ్ల‌గా దూరంగా ఉంటున్నాడు. ఇదంతా విశ్లేషించి చూస్తే? సుదీప్ ఇక క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కే ప‌రిమిత‌మ‌వుతాడు? అన్న‌ది బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి హెమ్ గ్రౌండ్ నుంచి సుదీప్ కు ఎంత మంది మ‌ద్దతుగా నిలుస్తారో చూడాలి. ఇప్ప‌టికే క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్ కుమార్, దునియా విజ‌య్ లాంటి వారు తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు.

అలాగే తెలుగు సీరియ‌ల్స్ లోనూ చాలా మంది క‌న్న‌డ‌ న‌టీన‌టులు ప‌ని చేస్తున్నారు. అర్చ‌నా అనంత్, నిత్యా రామ్, మేఘ‌నా లోకేష్ , శోభా శెట్టి , మంజుల , నవ్య స్వామి, ఐశ్వర్య పిస్సె, నిత్యా రామ్, పల్లవి గౌడ, తనూజ గౌడ , చిత్ర రాయ్, అనూష హెగ్డే, నవ్య రావు, వీణ పొన్నప్ప వీరంతా తెలుగు బుల్లి తెర సీరియ‌ల్స్ లో ఎంతో ఫేమ‌స్ అయిన వారు. వీరి కార‌ణంగా తెలుగు న‌టీమ‌ణులు అవ‌కాశాలు కోల్పోతున్నారు? అన్న విమ్శ‌లు కూడా ప‌రిశ్ర‌మ‌లో తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రి వీరంతా సుదీప్ మాట‌ల‌తో ఎకీ భ‌విస్తారా? అందుకు అవ‌కాశం ఉందా? లేదా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News